Viral Video: మోసగాళ్లకు మోసగాడు.. ఏం జరిగిందో చూడండి..! ఈ వీడియో చుస్తే కర్మ ఫలం అంటే ఏంటో బాగా తెలుస్తుంది..
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి దగ్గరికి వచ్చిన కస్టమర్‌ను చాలా తెలివిగా మోసం చేయాలనుకున్నాడు. కట్ చేస్తే సీన్ కాస్తా రివర్స్ అయింది. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరు కూడా లుక్కేయండి.!నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పండ్ల దుకాణానికి వచ్చి కొన్ని పండ్లు కొన్నాడు. దుకాణదారుడు కస్టమర్ అడిగిన పండ్లను తూకం వేసి ఒక కవరులో పెట్టి ఇస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇక్కడే దుకాణదారుడు తన దుర్బుద్దిని ప్రదర్శించాడు. కస్టమర్‌ని మోసం చేయబోయాడు. కవర్‌లో వేసిన పండ్ల నుంచి ఒకటి బయటికి తీసేస్తాడు. ఇదంతా కస్టమర్ గమనించలేదని అతడు అనుకున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కస్టమర్ ఈ తతంగం మొత్తం గమనించాడు.. దుకాణదారుడికి ఇవ్వడానికి ఫర్సులోంచి డబ్బులు తీస్తుంటాడు. ఇంతలో దుకాణదారుడు పండ్ల కవరు కస్టమర్‌కి ఇస్తాడు. డబ్బులు తియ్యడం ఆపి పండ్ల కవర్ తీసుకుని కస్టమర్ తుర్రుమని పారిపోతాడు. నెత్తీ నోరే బాదుకుంటూ దుకాణదారుడు అతని బండివెనక పడ్డాడు.. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.. .అలాగే.. మోసగాళ్లకు మోసగాడు అంటే ఇతనే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

