కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్‌ టైగర్‌.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

|

Jan 31, 2024 | 8:33 PM

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. బంగారు వర్ణంలో ఠీవీగా నడుస్తున్న పులిని ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మతన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ రాష్ట్రంలోని అరుదైన వన్యప్రాణులకు నిదర్శనం ఈ వీడియో.. కజిరంగా నేషనల్ పార్క్ లో ఇటీవల కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్ టైగర్ ఇది అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. బంగారు వర్ణంలో ఠీవీగా నడుస్తున్న పులిని ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మతన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ రాష్ట్రంలోని అరుదైన వన్యప్రాణులకు నిదర్శనం ఈ వీడియో.. కజిరంగా నేషనల్ పార్క్ లో ఇటీవల కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్ టైగర్ ఇది అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇదొక జీవిత కాల అనుభవం అంటూ ఈ వీడియో తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గౌరవ్ రాంనారాయనణ్ మీడియాతో పంచుకున్నారు. ఈ నెల 24న కొంతమంది అతిథులను కజిరంగా పార్క్ లో సఫారీ రైడ్ కు తీసుకెళ్లానని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం సుమారు మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో ఈ అరుదైన గోల్డెన్ టైగర్ తమకు ఎదురైందని తెలిపాడు. తమ వాహనానికి దాదాపు 80 మీటర్ల చేరువలోకి వచ్చిందని వివరించిన ఆయన, వెంటనే తన దగ్గరున్న కెమెరాలో పులిని రికార్డు చేశానని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టపగలు చోరీ చేయడం ఇంత ఈజీనా !! నెట్టింట వీడియో వైరల్

బాలరాముడి విగ్రహ శిల వెనుక కన్నీటి గాథ.. భగవంతుని లీల అంటున్న కాంట్రాక్టర్‌

మద్దిచెట్టులో వినాయకుని రూపం..వింతను చూసేందుకు క్యూగట్టిన జనం

రామాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము ప్రత్యేక్షం

మితిమీరిన ఉత్సాహం జైలుకు పంపింది.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

 

Follow us on