అరుదైన పుట్టగొడుగు..ఏకంగా 10 కిలోల బరువుతో..

ఒడిశాలోని సంబల్​పుర్​ జిల్లా ఖలియాముండా గ్రామానికి చెందిన లూరి కిషన్​ అనే వ్యక్తి తన పెరట్లోని మొక్కలను పరిశీలిస్తున్నాడు. ఆ పెరట్లో రకరకాల చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. ఓ ఖర్జూర చెట్టు కూడా ఉంది. దాని కింద దాదాపు 8 నుంచి 10 కిలోల బరువుండే పెద్ద పుట్టగొడుగు కనిపించింది. వెంటనే దానిని తీసి ఇంటికి తీసుకెళ్లాడు.

అరుదైన పుట్టగొడుగు..ఏకంగా 10 కిలోల బరువుతో..

|

Updated on: Aug 02, 2023 | 8:47 PM

ఒడిశాలోని సంబల్​పుర్​ జిల్లా ఖలియాముండా గ్రామానికి చెందిన లూరి కిషన్​ అనే వ్యక్తి తన పెరట్లోని మొక్కలను పరిశీలిస్తున్నాడు. ఆ పెరట్లో రకరకాల చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. ఓ ఖర్జూర చెట్టు కూడా ఉంది. దాని కింద దాదాపు 8 నుంచి 10 కిలోల బరువుండే పెద్ద పుట్టగొడుగు కనిపించింది. వెంటనే దానిని తీసి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంత పెద్ద పుట్టగొడుగును గతంలో ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోయాడు కిషన్‌. ఇది అరుదైన జాతికి చెందిన మష్రూమ్ అని భావిస్తున్నామని కిషన్‌ తెలిపాడు. గ్రామస్థులు సైతం ఇంత పెద్ద పుట్టగొడుగును చూసేందుకు తరలివచ్చారు. కొన్నాళ్ల క్రితం.. కేరళకు చెందిన ఓ మహిళ ఇంటి పెరట్లో దాదాపు 2 కిలోల బరువున్న రెండు పుట్టగొడుగులు మొలకెత్తి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు ఈ అరుదైన పుట్టగొడుగు వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుట్కాతో ఐస్‌క్రీమ్ తయారీ.. ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు

 

Follow us