విశాఖలో వింత పాము హల్‌చల్.. కాటు వేస్తే.. కండరాల్లో

|

Aug 30, 2022 | 8:36 PM

విశాఖలో అరుదైన కుక్క మూతి నీటిపాము కనిపించింది. కాన్వెంట్ జంక్షన్ పరిశ్రమల ప్రాంతంలో.. బురదలో ఉన్నట్టు గుర్తించి సమాచారాన్ని పాములు పట్టే నేర్పరి స్నేహ కిరణ్ కు అందించారు.

విశాఖలో అరుదైన కుక్క మూతి నీటిపాము కనిపించింది. కాన్వెంట్ జంక్షన్ పరిశ్రమల ప్రాంతంలో.. బురదలో ఉన్నట్టు గుర్తించి సమాచారాన్ని పాములు పట్టే నేర్పరి స్నేహ కిరణ్ కు అందించారు. పాము ఉన్న ప్రాంతానికి చేరుకున్న స్నేక్ కిరణ్.. అత్యంత చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నారు. అరుదైన కుక్క మూతి నీటిపామును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పామును తీసుకెళ్లి ఆర్కే బీచ్ సముద్రంలో వదిలేశారు. అయితే.. సాల్ట్ కోబ్రా గా పిలవబడే ఈ పాము.. తీర ప్రాంతాల్లో ఉంటుంది. మడ అడవులు, బురద నేలలు వీటి ఆవాసం. నీటిలో ఉండే కీటకాలు చేపలను తింటుంది. ఈ పాము కాటు వేస్తే.. కండరాల్లో కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. మందు కూడా అంత ప్రభావవంతంగా పనిచేయదట. పాములు పట్టే తన 20 ఏళ్ల జీవితంలో వివిధ రకాల 25 వేలకు పైగా పాములను చూసినా.. ఈ కుక్క మూతి నీటిపామును ఎప్పుడూ చూడలేదని అంటున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొట్టి పొట్టి స్కర్ట్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన ఎయిర్‌ హోస్టెస్‌ !! ఫిదా అవుతున్న కుర్రకారు

పొట్టకూటి కోసం ఈ కార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే !!

భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె చనిపోయాక ఊహించని పని చేసిన భర్త !!

Viral: పెళ్లి దుస్తులతో నవ వధువు వర్కవుట్స్‌.. రీజన్ తెలిస్తే షాక్

కాలా చ‌స్మా సాంగ్‌కు అద‌ర‌గొట్టే స్టెప్పులు !! చిన్నారుల డాన్స్‌కు కేటీఆర్‌ ఫిదా !!