భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె చనిపోయాక ఊహించని పని చేసిన భర్త !!
భార్యభర్తల బంధం ఎంతో గొప్పది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ప్రయాణం చేయడం అనేది గొప్ప విషయం.
భార్యభర్తల బంధం ఎంతో గొప్పది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ప్రయాణం చేయడం అనేది గొప్ప విషయం. భార్యపై అమితమైన ప్రేమను ప్రదర్శించే భర్తలు ఇప్పుడు సొసైటీలో తగ్గిపోయారనే చెప్పాలి. ఎక్కువ ప్రేమను పంచే భర్తలు తమ భార్యలకు విలువైన బహుమతులు ఇస్తుంటారు.. ఇంకొందరు రకరకాల సర్‌ప్రైజ్‌లు ఇచ్చి వాళ్లను ఎగ్జైట్ చేస్తారు. భాగస్వామికి చిన్న బాధ వచ్చినా తట్టుకోలేరు కొందరు. అయితే తాజాగా భార్యపై అమితమైన ప్రేమతో ఓ భర్త చేసిన పని చర్చనీయాంశమైంది. భార్య చనిపోతే.. ఆమె తనతోనే ఉండాలని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. మధ్యప్రదేశ్ లోని డిండౌరీలో నివాసం ఉండే ఓంకార్ దాస్ అనే వ్యక్తి లోకల్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నాడు. అతనికి రుక్మిణి అనే మహిళతో పాతికేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరికి పిల్లలు లేరు. అయినప్పటికీ ఆలూమగలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాగా అనారోగ్య కారణాలతో అతని భార్య ఆగస్టు 23న చనిపోయింది. అయితే ఆమెపై అతి ప్రేమతో ఇంట్లోనే డెడ్‌బాడీని పూడ్చిపెట్టాడు ఓంకార్ దాస్. విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల వారు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులనుంచి స్పందన లేకపోవడంతో.. కలెక్టర్ కార్యలయానికి వెళ్లి కంప్లైంట్ చేశారు. దీంతో వెంటనే స్థానిక తహశీల్దార్ రంగంలోకి దిగి.. పోలీసులను తీసుకువెళ్లి.. డెడ్‌బాడీని బయటకు తీసి నర్మదా నది ఒడ్డున పాతిపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: పెళ్లి దుస్తులతో నవ వధువు వర్కవుట్స్.. రీజన్ తెలిస్తే షాక్
కాలా చస్మా సాంగ్‌కు అదరగొట్టే స్టెప్పులు !! చిన్నారుల డాన్స్‌కు కేటీఆర్ ఫిదా !!
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

