కాలా చస్మా సాంగ్‌కు అదరగొట్టే స్టెప్పులు !! చిన్నారుల డాన్స్‌కు కేటీఆర్ ఫిదా !!
సోషల్ మీడియాలోఎన్నో రకాల వీడియోలు ఉంటాయి. ట్యాలెంట్ ను బయటకు తీసేందుకు మంచి వేదికగా సోషల్ మీడియాను చెప్పవచ్చు. చాలా మంది డ్యాన్స్, పాటలు, స్టంట్ వీడియోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉంచుతారు.
సోషల్ మీడియాలోఎన్నో రకాల వీడియోలు ఉంటాయి. ట్యాలెంట్ ను బయటకు తీసేందుకు మంచి వేదికగా సోషల్ మీడియాను చెప్పవచ్చు. చాలా మంది డ్యాన్స్, పాటలు, స్టంట్ వీడియోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉంచుతారు. దీంతో అవి మరింత వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కాలా చష్మా వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ పాటపై చాలా మంది వ్యక్తులు రీల్స్ చేసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోలో కొంతమంది పిల్లలు డాన్స్ చేస్తున్నారు. వారిని చూస్తుంటే ఆఫ్రికా ఖండంలోని ఓ దేశానికి చెందిన వారని తెలుస్తోంది. వారు కాలా చష్మా పాటకు అద్భుతమైన స్టెప్స్ వేశారు. పాటపై 12 మంది చిన్నారులు డ్యాన్స్ చేశారు. ఒరిజినల్ స్టెప్స్‌తో పాటు రీమిక్స్ స్టెప్పులనూ వేస్తూ ఆశ్చర్యకరమైన ప్రదర్శన ఇచ్చారు. అంతే కాకుండా చిన్నారులు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల డ్యాన్స్, వారి ట్యాలెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఐఏఎఫ్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఏవియేటర్ అనిల్ చోప్రా షేర్ చేయగా.. ఆ వీడియో చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయిపోయారు. అంతేకాదు వీడియోను రీట్వీట్ చేస్తూ… తప్పకుండా ఆ పిల్లలు ఎదుగుతారని, వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆఫ్రికన్ చిన్నారులు అద్భుతంగా డ్యాన్స్ చేసి అదరగొట్టారని కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అమలాపాల్‌కు లైంగిక వేధింపులు | డ్యాన్సింగ్ షోలో మహేష్ విత్ సితార
Big News Big Debate: పవార్ వార్‌కు పరిష్కారం ఉందా ?? లైవ్ వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

