పొట్టకూటి కోసం ఈ కార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే !!

పొట్టకూటి కోసం ఈ కార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే !!

Phani CH

|

Updated on: Aug 30, 2022 | 8:31 PM

జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తే ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ఇలాంటివి చూడాల్సి వస్తుందా అనే బాధ కలుగుతుంది. మారుతున్న కాలం..

జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తే ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ఇలాంటివి చూడాల్సి వస్తుందా అనే బాధ కలుగుతుంది. మారుతున్న కాలం.. పెరుగుతున్న ఖర్చులతో సామాన్య మానవుడు బతుకుబండిని ఈడ్చటం చాలా కష్టమే. అయినా ఏదో ఒక కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం చూస్తుంటాం. పేద ప్రజల జీవనంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాయి. కొన్ని సంఘటనలు చూసి ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరడం లేదా అనే అనుమానాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికి కుటుంబ పోషణ కోసం వ్యక్తి పడే తపన అంతా ఇంతా కాదు. ఇలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ లో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బతుకుబండిని ఈడ్చటం కోసం ఓ రిక్షా కార్మికుడు తన ఏడాదిలోపు పిల్లాడిని భుజం మీద వేసుకుని.. ఓ చేత్తో బిడ్డని, మరో చేత్తో రిక్షా తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను ఇంటినుంచి బయలేదేరేటప్పుడు తన కుమారుడిని భుజం మీద వేసుకుని ప్రయాణీకుల కోసం మధ్యప్రదేశ్‌ లోని జబల్ పూర్ నగరంలో తిరుగుతున్నాడు. రాజేష్ అనే వ్యక్తి పాలు తాగే తన కొడుకును ఒక్కడిని ఇంట్లో వదలలేక.. తనతో పాటు తీసుకెళ్తున్నాడు. ప్రయాణీకులను ఎక్కించుకుని రిక్షా నడుపుతున్నప్పుడు రాజేష్ ఒక చేతితో తన బిడ్డను, మరో చేతితో రిక్షా హ్యాండిల్ పట్టుకుని రైడ్ చేయడం అందరి కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె చనిపోయాక ఊహించని పని చేసిన భర్త !!

Viral: పెళ్లి దుస్తులతో నవ వధువు వర్కవుట్స్‌.. రీజన్ తెలిస్తే షాక్

కాలా చ‌స్మా సాంగ్‌కు అద‌ర‌గొట్టే స్టెప్పులు !! చిన్నారుల డాన్స్‌కు కేటీఆర్‌ ఫిదా !!

Published on: Aug 30, 2022 08:31 PM