Rare disease: ఉమ్మనీటి సంచితో పుట్టిన కవలలు.. 80,000 జననాల్లో ఒకసారి ఇలా.. అరుదైన దృశ్యం..
కవల శిశువులు ఉమ్మనీటి సంచితో సహా పుట్టిన అత్యంత అరుదైన సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా ఉమ్మనీటి సంచి ప్రసవ సమయంలో దానంతటదే పగిలిపోతుంది.
కవల శిశువులు ఉమ్మనీటి సంచితో సహా పుట్టిన అత్యంత అరుదైన సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా ఉమ్మనీటి సంచి ప్రసవ సమయంలో దానంతటదే పగిలిపోతుంది. అలా కాకుండా శిశువు ఉమ్మ సంచితో పాటు పుట్టడం చాలా అరుదు. అందులోనూ ఈ కవలలిద్దరూ ఉమ్మ సంచితో పుట్టారు! వీటిని ‘ఎన్ కౌల్’ లేదా వెయిల్డ్ బర్త్స్ అంటారట. ప్రతి 80,000 జననాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే చాన్సుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ ఆడ శిశువుల ఉమ్మ సంచిని వైద్యులు సి–సెక్షన్ ద్వారా విచ్ఛిన్నం చేసి వారిని క్షేమంగా బయటికి తీశారు. దీన్నంతా వీడియో తీశారు. అదిప్పుడు ప్రపంచమంతటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవలలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారట. వీరికి మారియా సెసీలియా, మారియా అలైస్ అని పేర్లు పెట్టారు. తల్లి గర్భంలో పిండ దశలోనే చుట్టూ ఉమ్మ నీరు ఏర్పడుతుంది. జన్మించేదాకా అది సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. గర్భస్థ పిండం ఉమ్మనీటి సంచిలోనే స్వేచ్ఛగా ఈదులాడుతుంది. శిశువు జన్మించే సమయం కంటే ముందే ఈ సంచి విచ్ఛన్న మవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

