Rare Leopard: అరుదైన చిరుత.. అదే దాని ప్రత్యేకత !! వీడియో
సాధారణంగా చిరుత పులులకు ఒంటినిండా చుక్కలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న చిరుత డిఫరెంట్‌గా ఉంది.
సాధారణంగా చిరుత పులులకు ఒంటినిండా చుక్కలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న చిరుత డిఫరెంట్‌గా ఉంది. దీని ఒంటిపైన చుక్కలకు బదులు చారలు ఉన్నాయి. అవి కూడా చాలా ప్రత్యేకంగా సముద్రపు అలల్లా.. ఆకాశంలో మేఘాల్లా కనిపిస్తున్నాయి. అందుకే దీనిని మేఘా చిరుత అంటున్నారు. ఇవి తొలిసారి నాగాలాండ్‌లోని పర్వత ప్రాంతాల్లో కనిపించాయి. కొంతమంది పరిశోధకులు పరిశోధనలు నిర్వహిస్తుండగా వారికి కనిపించాయట. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో… స్థానికులు కాపాడుకుంటున్న అడవిలో ఇవి కనిపించాయట. కాగా ఈ చిరుతలు సముద్ర మట్టానికి 3,700 మీటర్ల ఎత్తులో కనిపించాయట. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా అంత ఎత్తులో చిరుతలు కనిపించలేదట. ఈ విషయాన్ని పరిశోధకులు వన్యమృగాలకు సంబంధించిన క్యాట్ న్యూస్‌లో ప్రచురించారు. ఇవి పెద్దపులుల జాతికి చెందిన చిన్న పులులని తెలిపారు. అయితే చిరుతల్లాగే ఇవికూడా చెట్లు ఎక్కుతాయి. వీటని అత్యంత అరుదైనవిగా గుర్తిస్తూ రెడ్ లిస్ట్‌లో పెట్టారట.
Also Watch:
దుప్పటి ఇవ్వగానే ఆ దివ్యాంగుడికి కాళ్లు వచ్చాయి !! ఎలా ?? వీడియో
Viral Video: పండు తొక్కతో సూపర్ లెదర్ బ్యాగ్ !! వీడియో
Viral Video: పాము తనను తాను తింటున్న వీడియో వైరల్.!
మళ్ళీ లాక్‌డౌన్ కావాలంటున్న స్టూడెంట్స్ !! ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరుగా !! వీడియో
Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెంప చెళ్‌మనిపించిన తండ్రి !! వీడియో