Ram Lalla statue: భవ్య రామమందిరానికి చేరిన రామ్‌లల్లా విగ్రహం.! వీడియో.
యావత్ భారతీయుల కలలరూపం.. అందాల బాలరాముడు అయోధ్య భవ్య మందిరం గర్భగుడిలోకి చేరుకున్నాడు. బుధవారం అయోధ్యకు చేరుకున్న బాలరాముని విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున గర్భగుడిలోకి ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. రామ్‌లల్లా విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చిక్రేన్ సహాయంతో గుర్భగుడిలోకి చేర్చినట్టు వివరించారు. కాగా విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్ఠించే అవకాశాలున్నాయని మిశ్రా తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు సంకల్పం,
యావత్ భారతీయుల కలలరూపం.. అందాల బాలరాముడు అయోధ్య భవ్య మందిరం గర్భగుడిలోకి చేరుకున్నాడు. బుధవారం అయోధ్యకు చేరుకున్న బాలరాముని విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున గర్భగుడిలోకి ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. రామ్‌లల్లా విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చిక్రేన్ సహాయంతో గుర్భగుడిలోకి చేర్చినట్టు వివరించారు. కాగా విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్ఠించే అవకాశాలున్నాయని మిశ్రా తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు సంకల్పం, గణేశాంబికాపూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవచనం, మాతృకాపూజ, సప్త ఘృత్ మాతృకా పూజ, ఆయుష్య మంత్ర జపం, తదితర పూజలు నిర్వహిస్తారని వివరించారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలిపారు. ప్రస్తుతం ఏడు రోజుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ రోజున కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని ట్రస్ట్ అధికారులు తెలిపారు. కాగా రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంట లోపు ముగియనుంది. బుధవారం ప్రధాన విగ్రహం ప్రతీకాత్మక ప్రతిరూపాన్ని ఆలయంలోకి తీసుకొచ్చి కలశ పూజ నిర్వహించారు. ప్రస్తుతం 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులను నిర్వహిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos