Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అద్భుతం వీడియో

పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అద్భుతం వీడియో

Samatha J
|

Updated on: Jun 28, 2025 | 8:24 PM

Share

రాజస్థాన్‌లోని దీగ్ జిల్లా బహాస్ గ్రామంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జరిపిన తవ్వకాల్లో ఒక అద్భుతం వెలుగు చూసింది. భూమికి 23 మీటర్ల లోతున ఒక ప్రాచీన నది ప్రవాహ మార్గం బయటపడింది. ఇది వేదాల్లో ప్రస్తావించిన సరస్వతి నది జాడ కావచ్చు అని భారత పురావస్తు చరిత్రలోనే ఇది అపూర్వమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 2024 నుంచి మే 2025 వరకు సాగిన ఈ తవ్వకాల్లో క్రీస్తు పూర్వం 3500-1000 మధ్యకాలంలో ఇక్కడ నాగరికత వెలసిల్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ ప్రాచీన నది వ్యవస్థ ఆనాటి మానవ ఆవాసాలకు జీవనాధారంగా నిలిచి బహాస్ గ్రామాన్ని విస్తృతమైన సరస్వతి నది పరివాహక సంస్కృతితో కలుపుతుందని ఏఎస్‌ఐ జైపూర్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ వినయ్‌గుప్తా తెలిపారు.

కుషానులు, మగధ, శుంగ వంశాల కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. తవ్వకాల్లో మట్టి స్తంభాల నివాస గృహాలు, పొరలు పొరలుగా ఉన్న గోడల కందకాలు, కొలనులు, వివిధ ఇనుప రాగి వస్తువులు బయటపడ్డాయి. సూక్ష్మ శిలా పరికరాలు, హోల్ సీన్ పూర్వకాలం నుంచే ఇక్కడ మానవ వునికిని సూచిస్తున్నాయి. క్రీస్తు పూర్వం వెయ్యి కాలానికి చెందిన 15 యజ్ఞకుండాలు, శక్తి ఆరాధన మొక్కుబడి చెరువులు, శివపార్వతుల మట్టి విగ్రహాలు ఆధ్యాత్మిక జీవనానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మీలిపి అక్షరాలున్న నాలుగు కాల్చిన ముద్రికలు లభించాయి. ఇవి భారత ఉపఖండంలో బ్రాహ్మీలిపికి సంబంధించిన అత్యంత పురాతన కాలాన్ని నిర్ధారించడానికి ఆధారాలు కావచ్చు అని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మహాజనపదాల కాలం నాటి యజ్ఞకుండాలలో అక్షరాలు లేని రాగి నాణేలు దొరకడం నాణేల ఆవిర్భావ చరిత్రపై కొత్త వెలుగునిచ్చే అవకాశం ఉంది. ఎముకల పనిముట్లు, విలువైన రాళ్లు, శంఖగాజులు ఆనాటి హస్తకళా నైపుణ్యాన్ని చాటుతున్నాయి. ఈ తవ్వకాలు భారతదేశ చరిత్రలోనే కీలక అధ్యాయాలను తెరకెక్కించగలవని వినయ్‌గుప్తా పేర్కొన్నారు. ఈ స్థల పరిరక్షణకు ఏఎస్‌ఐ సంస్కృతిక మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.

మరిన్ని వీడియోల కోసం :

దృశ్యం 3’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..బ్లాక్ బ‌స్టర్ కాంబో రిపీట్‌..

నాగార్జున కాళ్లు మొక్కేది.. ఆ ఒక్కడికే వీడియో

ప్యారిస్‌ మ్యూజిక్ షోలో.. సిరంజిలతో దాడి వీడియో