Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి రాత్రి గదిలోకి కత్తితో వెళ్లిన వధువు..భర్తను ఏమని బెదిరించిందంటే..

మొదటి రాత్రి గదిలోకి కత్తితో వెళ్లిన వధువు..భర్తను ఏమని బెదిరించిందంటే..

Samatha J
|

Updated on: Jun 29, 2025 | 3:23 PM

Share

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ వధువు.. మొదటి రాత్రి గదిలో ఉన్న భర్తను కత్తితో బెదిరించిన ఘటన యూపీలో జరిగింది. హనీమూన్‌లో భర్తను చంపించిన ఇందౌర్‌ యువతి సోనమ్‌ రఘువంశీ ఉదంతాన్ని మరువకముందే ఉత్తరప్రదేశ్‌ లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ నవ వధువు మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకెళ్లి చంపేస్తానంటూ భర్తను బెదిరించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్‌ అనే వ్యక్తికి ఇటీవల సితార అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆనందంగానే కన్పించిన ఆ వధువు.. మొదటి రాత్రి వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకొచ్చి తనను తాకితే.. 35 ముక్కలు చేస్తా అంటూ భర్తను బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను అమన్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబసభ్యులపైనా బెదిరింపులకు పాల్పడింది. దాంతో ఎక్కడ తనను నిజంగా పొడుస్తుందో అని భయపడి నిషాద్‌ రాత్రంతా నిద్రపోలేదు. రాత్రంతా భయం భయంగా గడిపాడు. చివరికి తల్లికి విషయం చెప్పాడు నిషాద్. మరుసటిరోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్‌ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. రెండవ రాత్రి అలాగే మూడవ రాత్రి కూడా కత్తితో భయపెట్టింది. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. సితారకు అమన్‌ వరుసకు మేనల్లుడు అవుతాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె మనసు మార్చుకుని తిరిగొచ్చినా ఆమెతో కలిసి ఉండలేననీ అంతగా తనను భయపెట్టిందని నిషాద్‌ వాపోయాడు.

మరిన్ని వీడియోల కోసం :

పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో

కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో

బ్యాచ్ లర్స్‌.. ఇది మీ కోసమే వీడియో