Railway track: రైల్వే క్రాసింగ్‌ వద్ద వాహనదారుల నిర్లక్ష్యం.. నెట్టింట షాకింగ్ వీడియో..

రైల్వే క్రాసింగ్స్ వద్ద పాదచారులు కానీ, వాహనదారులు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ప్రమాదంలో పడతారు. తాజాగా రైల్వే గేటు క్లోజ్‌ చేసినప్పటికీ రైలు పట్టాలను దాటడానికి..

Railway track: రైల్వే క్రాసింగ్‌ వద్ద వాహనదారుల నిర్లక్ష్యం.. నెట్టింట షాకింగ్ వీడియో..

|

Updated on: Jun 27, 2022 | 9:06 PM


రైల్వే క్రాసింగ్స్ వద్ద పాదచారులు కానీ, వాహనదారులు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ప్రమాదంలో పడతారు. తాజాగా రైల్వే గేటు క్లోజ్‌ చేసినప్పటికీ రైలు పట్టాలను దాటడానికి ఓ కారు డ్రైవర్ ప్రయత్నిస్తున్న వీడియోను కెనడా రైల్వే సంస్థ రిలీజ్ చేసింది. ఇటీవల కెనడాలోని టొరంటోలో ఒక పాసింజర్ రైలు రైల్వే పట్టాలను దాటుతున్న కారును ఢీకొట్టింది. . ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. అంటారియాలోని రోడ్లు, ప్రజా రవాణాను నిర్వహించే ప్రభుత్వ సంస్థ మెట్రోలింక్స్. “లెవల్ క్రాసింగ్‌ల వద్ద భద్రత గురించి అవగాహన కల్పించడానికి” ఈ వీడియోను విడుదల చేసింది.ఈ వీడియో క్లిప్ లో రైలు రాబోతుందని సూచిస్తూ..రోడ్డు కి అడ్డంగా రైల్వే గెట్ తో క్లోజ్ చేసింది. ఇంతలో ఓ కారు రైల్‌రోడ్ క్రాసింగ్‌ను సమీపిస్తుంది.. ఆ డ్రైవర్‌ ట్రాక్‌ క్లోజ్‌ చేసి ఉన్నప్పటికీ ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నిస్తూ కారును రైలు ట్రాక్‌ పైకి పోనిచ్చాడు. ఇంతలో రైలు వచ్చేసింది. వేగంగా దూసుకొచ్చిన ఆ రైలు కారుని ఢీ కొట్టింది. ఈ వీడియో చివరలో దెబ్బతిన్న కారు చిత్రం కూడా చూపించారు. అదృష్టవశాత్తు ఆ డ్రైవర్‌కు ఎటువంటి తీవ్రమైన గాయాలు కానట్లు తెలుస్తోంది. అంతేకాదు వెంటనే డ్రైవర్ ఆ ఘటనా స్థలం నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడిన అతను ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రతి సంవత్సరం 100 మంది కెనడియన్లు లెవెల్ క్రాసింగ్‌ల వద్ద తీవ్రంగా గాయపడుతున్నారు లేదా మరణిస్తున్నారని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. “లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. రైళ్లు వేగంగా ప్రయాణిస్తాయని.. గుర్తుంచుకోవాలని మెట్రోలింక్స్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ మార్టిన్ గల్లాఘర్ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us