AP News: మేక మిస్సయిందని వెతుకుతుండగా.. అడవిలో చెట్ల పొదల మాటున
అల్లూరి ఏజెన్సీలో మేతకు వెల్లింది ఓ మేకల మంద.. కొండపై వెళ్లి మేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి జీవాలు.. అలా అలా ముందుకు వెళ్లిపోయాయి.. చివరకు తిరిగి వెళ్తున్న క్రమంలో.. మందలో ఉన్న ఓ మేక మిస్సయింది. ఎక్కడుందని అంతా వెతికారు. కొండపై గాలించారు. ఎక్కడా కనిపించలేదు.. ఈ క్రమంలో...
అల్లూరి ఏజెన్సీలో మేకలు మందను కొండ ప్రాంతంలో మేపేందుకు తీసుకెళ్లారు కొందరు వ్యక్తులు. వర్షాలు పడుతుండటంతో.. మంచి పచ్చిక దొరుకుతుండటంతో… మేకలు, గొర్రెలు అలా అలా పైకి వెళ్లసాగాయి. పొద్దు కూకే సమయం అవ్వడంతో.. తిరిగి ఇళ్లకు వెళ్ధామనుకున్నారు. ఈ క్రమంలో మందలో ఉన్న ఓ మేక మిస్సయినట్లు వారు గుర్తించారు. మంద నుంచి తప్పిపోయి ఉంటుందని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. కొండపై గాలించారు. ఎక్కడా కనిపించలేదు.. ఎక్కడో ఉందిలే వచ్చేస్తుందని అనుకున్నారు.. ఇంతలో ఓ గుట్ట పక్కన ఏదో శబ్దం వినిపిస్తూ ఉంది. తొంగి చూసేసరికి.. ఏదో అక్కడ కదులుతూ కనిపించింది. కాస్త దగ్గరిగా వెళ్లి పరీక్షగా చూడగా… ఓ భారీ కొండచిలువ కదలేని స్థితిలో ఉంది. దాని పొట్టలో ఏదో ఉన్నట్టు గమనించరు. ఏదో కాదు.. ఆ కొండచిలవే మేకను మింగిందని తర్వాత డిసైడ్ అయ్యారు. అరకులోయ సమీపంలోని అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ వెలగపాడు గ్రామ కొండపై ఈ ఘటన జరిగింది. పాతికవేలు విలువ చేసే మేకను కొండచిలువ మింగేసిందని.. దాని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

