Viral Rare Cat: ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో.. ఇవాళ హార్స్‌లీ హిల్స్‌లో..

|

May 26, 2024 | 9:07 PM

నిన్న శ్రీశైలంలో పునుగుపిల్లి సందడిచేస్తే.. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్ లీ హిల్స్ లో మరో పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. బి కొత్తకోట మండలంలోని హార్స్ లీ హిల్స్ లో టూరిజం గెస్ట్ హౌస్ వద్ద కనిపించింది. ఇనుప కంచె కు చిక్కుకొని ఉన్న వన్యప్రాణి ని గుర్తించిన పర్యాటకులు కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

నిన్న శ్రీశైలంలో పునుగుపిల్లి సందడిచేస్తే.. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్ లీ హిల్స్ లో మరో పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. బి కొత్తకోట మండలంలోని హార్స్ లీ హిల్స్ లో టూరిజం గెస్ట్ హౌస్ వద్ద కనిపించింది. ఇనుప కంచె కు చిక్కుకొని ఉన్న వన్యప్రాణి ని గుర్తించిన పర్యాటకులు కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇనుప కంచె లో చిక్కుకున్నది పునుగుపల్లి గా నిర్ధారించుకున్న అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా పునుగుపిల్లిని కాపాడారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కనిపించే అరుదైన పునుగుపిల్లి ఇప్పుడు హార్సిలీ హిల్స్ లో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పునుగు పిల్లి నుంచి సుగంధ తైలం సేకరించి తిరుమల వెంకన్న అభిషేకానికి వినియోగిస్తారు. అందుకే ఈ అరుదైన ప్రాణికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతరించి పోతున్న జంతుజాతుల్లో పునుగుపిల్లి కూడా ఉంది. దాదాపు 18 రకాల జాతులున్న పునుగు పిల్లుల్లో హార్స్ లీ హిల్స్ లో గుర్తించిన పునుగు పిల్లి ఆసియా రకానికి చెందినది గా గుర్తించారు. హార్స్ లీ హిల్స్ వాతావరణం పునుగుపిల్లికి అనువైనదిగా భావిస్తున్న అటవీ శాఖ పులుగుపిల్లి మనుగడ ఈ ప్రాంతంలో ఉన్నట్టు భావిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on