వీడెవడండీ బాబూ.. వేలితో చేపలు పట్టేస్తున్నాడు !! వీడియో
సాధారణంగా చేపలు ఎలా పడతారు.. వలలు వేస్తారు.. లేదా గేలానికి ఎరను కట్టి చేపలు పడతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేతి వేలితో ఈజీగా చేపలు పట్టేస్తున్నాడు.
సాధారణంగా చేపలు ఎలా పడతారు.. వలలు వేస్తారు.. లేదా గేలానికి ఎరను కట్టి చేపలు పడతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేతి వేలితో ఈజీగా చేపలు పట్టేస్తున్నాడు. ఇందుకోసం అతను బొటనవేలుని ఉపయోగిస్తున్నాడు. చిన్న టెక్నిక్‌తో క్షణాల్లో కేజీ చేపను పట్టేశాడు. ట్విట్టర్ అకౌంట్‌లో జనవరి 8న ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో ఓ కుర్రాడు… ప్రశాంతంగా ఉన్న ఓ సెలయేరు దగ్గరకు వెళ్లాడు. నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తోంది. ఆ నీటిలో తన కుడిచేతిని పెట్టిన కుర్రాడు… బొటన వేలును అటూ ఇటూ కదుపుతూ ఉన్నాడు. అలా అతను కదిపిన 10 సెకండ్లలో ఓ చేప… అతని వేలును తిందామని వచ్చింది. అంతే… వెంటనే చేపను పట్టి నీటి లోంచీ పైకి తీసి చూపించాడు. ఇలా ఎలా సాధ్యమైందనేగా మీ డౌటు… టెక్నిక్ అంతా అతని వేలిలోనే ఉంది. ఆ వేలును కదుపుతున్నప్పుడు అతను అస్సలు కదలకుండా అంటే స్టాచ్యూలాగా కూర్చున్నాడు. కనీసం చెయ్యి కూడా కదపలేదు. కేవలం నీటిలో బొటనవేలుని మాత్రం కదిలించాడు.
Also Watch:
Viral Video: రెస్టారెంట్ లో దున్నపోతు రచ్చ రచ్చ !! వీడియో
ఇది మామిడి స్పెషల్ వైన్ !! యూపీలో మొదటిసారి !! వీడియో
Driver Less Tractor: ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు !! వీడియో
మరొక అద్భుత సృష్టి.. మనిషిలా ఆలోచించే రోబో !! వీడియో
ఈ అమ్మాయి పంచ్‌ల దెబ్బకు ఏకంగా కుప్పకూలిన చెట్లు !! వీడియో