Viral Video: పెళ్లి మండపంలోకి పోలీసుల ఎంట్రీ.. పారిపోయిన వధూవరులు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. వధూవరులు మండపానికి చేరుకున్నారు. బంధు, మిత్రులంతా వేడుకకు హాజరయ్యారు. ఈ సమయంలోనే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వధూవరులు పెళ్లి పీటలపై నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు
పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. వధూవరులు మండపానికి చేరుకున్నారు. బంధు, మిత్రులంతా వేడుకకు హాజరయ్యారు. ఈ సమయంలోనే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వధూవరులు పెళ్లి పీటలపై నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వరుడి తండ్రితో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 20న రాత్రి మన్సుఖ్‌పురాలోని కర్కౌలి గ్రామంలో పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. వరుడు బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా బంధువులతో కలిసి వధువు ఇంటికి వచ్చాడు.ఈ క్రమంలో యువతి మైనర్ అంటూ గ్రామస్తుడు ఒకరు మన్సుఖ్‌పురా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్టేషన్ ఇన్‌చార్జి గిరీష్‌కుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే బంధువులంతా ఖంగుతిన్నారు. వధూవరులు భయపడి పీటల మీద నుంచి పొలాల వైపు పారిపోయారు. ఆ తర్వాత బంధువులు సైతం వివాహ వేదిక నుంచి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత వరుడి తండ్రి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. బాలిక వయసుకు సంబంధించిన పత్రాలతో రావాలని సూచించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మైనర్‌కు వివాహం జరిపించినట్లయితే నిందితులందరిపై చర్యలుంటాయని ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral Video: భార్యను వదిలి ప్రియురాలితో జంప్.. ఖర్చులతో సహా.. దిమ్మదిరిగే షాకిచ్చిన కోర్టు..!
Donkey Race: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోతుంది..!
Scotch,whiskey prices: మద్యం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు.!
Snake-Rat: తక్కువ చేస్తే ఇట్లనే ఉంటది.. పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. వీడియో చూస్తే షాకవుతారు..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

