భాగ్యనగరంలో భలే దొంగ !!  వీడు దోచుకోడు.. కానీ !!

భాగ్యనగరంలో భలే దొంగ !! వీడు దోచుకోడు.. కానీ !!

Phani CH

|

Updated on: Jun 03, 2022 | 8:07 PM

నగరంలో నయా దొంగతనం వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేయడం ఒకెత్తయితే.. దోచుకున్న వస్తువును క్యాష్‌గా మార్చుకోవడం ఇంకో ఎత్తు. బంగారం, నగలు దోచుకున్నవారు ఏ జ్యూయలరీ దుకాణంలోనో అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు

నగరంలో నయా దొంగతనం వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేయడం ఒకెత్తయితే.. దోచుకున్న వస్తువును క్యాష్‌గా మార్చుకోవడం ఇంకో ఎత్తు. బంగారం, నగలు దోచుకున్నవారు ఏ జ్యూయలరీ దుకాణంలోనో అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ఆ క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఈజీగా దొరికిపోతుంటారు. ఈ దొంగ మాత్రం కాసింత కొత్తగా ఆలోచించాడు. తాను దొంగిలించిన వస్తువులను ఎవరికీ అనుమానం రాకుండా స్మార్ట్‌ గా అమ్మడం మొదలెట్టాడు. అయినా పోలీసుల డేగకళ్ల నుంచి తప్పించుకోలేకపోయాడు. చివరికి కటకటాలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్‌లో కిరణ్‌ అనే వ్యక్తి స్మార్ట్‌గా ఆలోచించాడు. అందుకు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ OLXను ఎంచుకున్నాడు. తాను కిరాయికి తెచ్చుకున్న కెమెరాలను బయట అమ్ముకుంటే దొరికిపోతామని భావించాడో ఏమోగాని.. అందుకు OLXను ఎంచుకుని ఎంచక్కా కెమెరాలను అమ్ముకుంటూ సొమ్ముచేసుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ కార్లు పార్కింగ్‌లో పెడుతున్నారా ?? అయితే జాగ్రత్త !!

అల్లరి చేయడం లో కూడా క్రమశిక్షణ తప్పవు !! ఈ కోతులు ఏం చేశాయో చూస్తే..

Viral Video: ఈ పెళ్లి కూతురి ఎంట్రీ చూస్తే మతి పోవాల్సిందే..!

TOP 9 ET News: 100 కోట్లకు దిశగా F3 | అందర్నీ ఏడిపిస్తున్నమేజర్

Published on: Jun 03, 2022 08:07 PM