ప్రధాని మోదీని పోలిన పానీపూరీ వాలా.. ఆశ్చర్యపోతున్న జనం

|

May 01, 2024 | 3:10 PM

గుజరాత్‌లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్‌ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారు. అనిల్‌ భాయ్‌ ఠక్కర్‌ అనే వ్యక్తి గుజరాత్‌లోని ఆనంద్‌లో పానీపూరీ సెంటర్‌ నడుపుతున్నాడు. చూడడానికి అచ్చం మోదీలానే హెయిర్‌ స్టైల్‌, తెల్లని గడ్డంతో ఉన్నాడు.

గుజరాత్‌లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్‌ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారు. అనిల్‌ భాయ్‌ ఠక్కర్‌ అనే వ్యక్తి గుజరాత్‌లోని ఆనంద్‌లో పానీపూరీ సెంటర్‌ నడుపుతున్నాడు. చూడడానికి అచ్చం మోదీలానే హెయిర్‌ స్టైల్‌, తెల్లని గడ్డంతో ఉన్నాడు. దీంతో స్థానికులు, అక్కడికి వచ్చిన వారంతా ఆయనతో సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వారంతా తనపై చాలా ప్రేమ, గౌరవం చూపిస్తూ ‘మోదీ’ అని పిలుస్తారని అనిల్‌ భాయ్‌ సంతోషంగా చెబుతున్నాడు. ఈ స్ట్రీట్‌ఫుడ్‌ వెండర్‌ అచ్చం మోదీ పోలికతో ఉన్నారు. కేవలం రూపాన్ని మాత్రమే కాదు.. ప్రధాని విలువల నుంచి చాలా స్ఫూర్తి పొందారు. పరిశుభ్రతకు మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను అనుసరిస్తూ తన స్టాల్‌ను కూడా ఎంతో శుభ్రంగా ఉంచాడంటూ ఓ ఫుడ్‌ వ్లాగర్‌ క్యాప్షన్‌ జోడించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నారా ?? బీ కేర్ ఫుల్

Mahesh – Manjula: అక్కా తమ్ముళ్ల ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ విడోస్

Prabhas: ప్రభాస్ కోసం.. రెండేళ్ల వెయిటింగ్ పిరియడ్

Suriya: రూ.350 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న సూర్య