Viral Video: విధులు సరిగా నిర్వహించకుంటే ఉరి తీస్తా.. అధికారులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్!

జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతే ఉరితీస్తా అంటూ హెచ్చరించారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతోంది.

Viral Video: విధులు సరిగా నిర్వహించకుంటే ఉరి తీస్తా.. అధికారులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్!
Gwalior Collector
Follow us

|

Updated on: Dec 16, 2021 | 7:10 AM

Gwalior Collector Warning For Staff: జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతే ఉరితీస్తా అంటూ హెచ్చరించారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతోంది. కరోనా కొత్త వేరియంట్, Omicron వేరియంట్, దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసింది. కాగా, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా గ్వాలియర్ జిల్లా మేజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది.

గ్వాలియర్ జిల్లా మేజిస్ట్రేట్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ మంగళవారం జరిగిన వ్యాక్సినేషన్ సమీక్ష సమావేశంలో అధికారులు, సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. టీకాలు వేయకుండా ఎవరైనా వెళ్లిపోతే, వారిని ఉరితీస్తా”అని హెచ్చరించారు. ఎవరైతే వాక్సిన్ తీసుకోలేదో వారి వద్దకు వెళ్లాలని. వారి పొలానికి వెళ్లండి, మనిషి కాళ్లు పట్టుకోండి లేదా అతని ఇంటికి వెళ్లి 24 గంటలు కూర్చోండి, అయితే టీకా లక్ష్యం నెరవేరాలి. అంటూ హుకుం జారీ చేశారు. జిల్లాలో టీకాలు తీసుకోని వారు ఎవరు ఉండకూడదన్నారు. అనుకున్న లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లాలో వ్యాక్సిన్ అమలు తీరుపై జిల్లా కలెక్టర్ బితార్వార్ తహసీల్‌లో అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఒకవైపు, కొత్త వేరియంట్ కలవరపెడుతుంటే, మరోవైపు వ్యాక్సిన్ పూర్తి కాలేదని లెక్కలు చెబుతున్నాయి. అయితే, కోవిడ్-19 టీకా లక్ష్యం చేరుకోలేదని గమనించారు. దీంతో కోపోద్రిక్తుడైన జిల్లా కలెక్టర్ ఒక్కరు మిగిలి ఉంటే ఉరిశిక్ష విధిస్తామని అధికారులను హెచ్చరించారు. ఆయన వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ఈ వీడియో వైరల్‌గా మారడంతో, ప్రభుత్వ ఉద్యోగులకు విషయం తీవ్రత అర్థం కావడం లేదని, అందుకే హెచ్చరిక అని డిఎం చెప్పుకొచ్చారు. టీకా లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే సస్పెన్షన్ వేటు కూడా తప్పదన్నారు.

Read Also…. Bank strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..