Bank strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె..
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు యూనియన్లు నేటి నుంచి 2 రోజుల సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించాయి. ఉద్యోగులు సమ్మెకు దిగవద్దని బ్యాంకుల యాజమాన్యం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు యూనియన్లు నేటి నుంచి 2 రోజుల సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించాయి. ఉద్యోగులు సమ్మెకు దిగవద్దని బ్యాంకుల యాజమాన్యం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. సమ్మె కారణంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్‌బిఎల్ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీకి ఇచ్చిన ఒక ప్రకటనలో, PNB బ్యాంకు తన శాఖలు, కార్యాలయాల కోసం ఏర్పాట్లు చేసింది. అన్ని బ్యాంకుల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ సమ్మెలో సుమారు తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులను అలర్ట్ చేశాయి. ఈ సమ్మె చెక్ క్లియరెన్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపనుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్లు సమ్మె చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యత రంగాలకు హాని కలిగిస్తుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రుణ ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. గత 25 ఏళ్లుగా యూఎఫ్‌బీయూ బ్యానర్ కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టం కలిగించే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చెప్పింది.
సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలతో ఆయా బ్యాంకులు చర్చలు జరిపాయి. సమ్మెను విరమించాలని ఉద్యోగులను కోరాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వీటిని దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశాయి. మంగళవారం వివిధ అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మె నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, సమ్మెలో పాల్గొనడం మానుకోవాలని దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ తన ట్వీట్‌లో ఉద్యోగులను కోరింది. ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమ్మెకు దూరంగా ఉండాలని బ్యాంకు ఉద్యోగులను కోరుతున్నాం’ అని పేర్కొంది.
2021-22 బడ్జెట్ సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రేవేటీకరణ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ వెల్లడించారు.
Read Also.. Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. తగ్గిన సిల్వర్ రేట్.. ఈ రోజు ధరలు ఇలా ఉన్నాయి..



