Dog Birthday: ఘనంగా శునకం బర్త్ డే పార్టీ.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా..!వీడియో వైరల్.
పెంపుడు జంతువులను ఎంతో ప్రేమ చేస్తారు మనుషులు.. అవీ కూడా అంత విశ్వాసంతో ఉంటాయి. పొరపాటును అవి తప్పిపోతే వాటి యజమానులు చేసే హడావుడి చాలా సార్లు చూశాం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంనకు చెందిన ఓ వ్యక్తి.. గత ఏడాది బెంగళూరు నుంచి గోల్డెన్ రిట్రైబర్ జాతికి చెందిన నెల వయసు టెడ్డీని 30 రూపాయలకు కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. ఇంట్లో కన్నబిడ్డలతో సమానంగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు.. దానికి ‛టెడ్డీ’ అని పేరు పెట్టుకున్నాడు.. ‛టెడ్డీ’ ఫస్ట్ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాడు.. గ్రామంలో ఇరుపొరుగు వారందరినీ పిలిచి మంచి భోజనం వడ్డించాడు.. శునకం పుట్టినరోజు వేడుకల్లో పిల్లలు, పెద్దల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాదు.. ఇల్లంతా బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించారు.. పెద్దలు, పిల్లలు టెడ్డీపై అక్షింతలు చల్లి ఆశీర్వాదించారు. నాజ్ వెజ్ ప్రియులకు నాన్‌వెజ్… వెజ్ తినేవారి కోసం ప్రత్యేకంగా కూరగాయలను తెప్పించి భోజన ఏర్పాట్లు చేశారు. సొంత పిల్లలను ఏవిధంగా చూసుకుంటున్నామో.. అదేవిధంగా పిల్లలతో సమానంగా టెడ్డికి కూడా పుట్టినరోజు వేడుక చేసామంటున్నారు యజమాని.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

