సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అందరిలాగే ఓ కుటుంబం తమ ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకుంటోంది. ఇక ఆ ఇంటి యజమాని కొడుకు అయితే కుక్కను విడిచి ఒక్కక్షణం కూడా ఉండలేనంతగా మారిపోయాడు. ఏకంగా రాత్రి వేళ కూడా కుక్క పక్కనే బోనులో దుప్పటి వేసుకుని పడుకుంటాడు. కుక్క కూడా చిన్నారి పట్ల ఎంతో ప్రేమ చూపుతూ ఉంటుంది. ఈ ఘటనను కుటుంబ సభ్యులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రేమ అంటే ఇలా ఉండాలి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో వేలాదిమంది వీక్షిస్తూ తమదైనశైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos