Ant face:చీమ ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా.? చీమను క్లోజప్‌లో చూసి వణికిపోతున్న నెటిజన్లు..(వీడియో)

Updated on: Oct 28, 2022 | 9:51 AM

ఫోటోగ్రాఫర్లు ప్రతి విషయాన్నీ విభిన్న కోణంలో చూస్తారు. ఒకే వస్తువు లేదా జీవిని రకరకాల యాంగిల్స్‌లో చూపిస్తూ కొంగొత్త రూపాలలో చూపిస్తారు. అది ఫోటోగ్రాఫర్ల ప్రత్యేకత. వారి ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. అలాంటి ఓ ఆలోచన ఈశాన్య ఐరోపా దేశమైన లిథువేనియాకు చెందిన ఓ వ్యక్తికి వచ్చింది.


యూజెనీయస్ కవలియాస్కాస్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌కు అసలు చీమలు ఎలా ఉంటాయి.. క్లోజప్‌లో చూస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. వెంటనే మైక్రోస్కోప్‌ అందుకున్నాడు. దాని ముందు ఒక చీమను పెట్టి దాని క్లోజప్‌ ఫోటో తీశాడు. అంతటితో ఆగలేదు. ఆ ఫోటోని ‘2022 నికాన్ స్మాల్ వరల్డ్ ఫోటోమైక్రోగ్రఫీ కాంపిటీషన్‌’కు పంపాడు.అయితే ఆ ఫోటోకి ప్రైజ్‌ రాలేదు కానీ, ఆ చీమను క్లోజప్‌లో చూసిన నెటిజన్స్‌ మాత్రం జడుసుకున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక్క దెబ్బకు స్వర్గానికి పోయే ఈ చీమ ఇంత భయంకరంగా ఉందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఆ చీమ ఫోటోను చూసిన ఒక నెటిజన్ ‘డ్రాగన్లు మాయమైపోయాయని ఎవరన్నారు? ఇదిగో ఇలా చిన్నగా అయిపోయాయంతే’ అని కామెంట్ చేస్తే.. ‘ఇదేదో భయంకరమైన హారర్ సినిమాలో సీన్‌లా ఉంది’అని మరొకరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 28, 2022 09:51 AM