పీడకలలతో త్వరగా వృద్ధాప్యం రావడమే కాదు.. మరణం కూడా వీడియో
గాఢనిద్రలో ఉన్నప్పుడు ప్రతి మనిషికి కలలు రావడం సహజం. కొందరికి మంచి కలలు వస్తే.. కొందరికి పీడకలలు వస్తాయి. ఎలాంటి కలలైనా అన్నిటినీ మనం తేలికగా తీసిపారేస్తుంటాం. ఎందుకంటే మంచి కలల్లాగే చెడు కలలు కూడా జీవితంలో భాగమేనని లైట్ తీసుకుంటాం. కానీ చెడు కలలను అంత ఈజీగా తీసుకోవద్దంటున్నారు శాస్త్రవేత్తలు.
అవును, దీర్ఘకాలంలో పీడకలలు మనిషిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తాజా అధ్యయనంలో తేలింది. తరచుగా పీడకలలు వచ్చే వ్యక్తుల్లో ముసలితనం త్వరగా పెరుగుతుందని యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తరచుగా పీడకలలు రాని ఒకే వయసు వ్యక్తులతో పోలిస్తే అధికంగా పీడకలలు వచ్చే వ్యక్తుల్లో వృద్ధాప్యం చాలా త్వరగా వస్తుందని స్పష్టం చేశారు. ఆరోగ్య పరిశోధనలో భాగంగా అమెరికాలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ బ్రెయిన్ సైన్సెస్ విభాగంలో క్లినికల్ రిసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్న డాక్టర్ అబిదెమీ ఒతైకు వివరించారు. పీడకలలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో 8 నుంచి పదేళ్లలోపు వయసున్న 2,429 మంది పిల్లలతోపాటు 26 నుంచి 86 ఏళ్ల వయసున్న 1,83,012 మంది వయోజనులు పాల్గొన్నట్టు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :