Aliens: త్వరలో ఏలియన్స్‌ను కలవబోతున్న మనుషులు..! ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ అతి త్వరలో..

|

May 24, 2022 | 4:57 PM

మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. మరోవైపు శాస్త్రవేత్తలు ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలే కాదు..


మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. మరోవైపు శాస్త్రవేత్తలు ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలే కాదు..త్వరలో సాధారణ మనుషులు కూడా గ్రహాంతర జీవులను కలుసుకుంటారని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాజీ శాస్త్రవేత్త ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతి త్వరలోనే మానవులు గ్రహాంతరవాసులను కలుసుకునే అవకాశం ఉందని చెప్పాడు. అమెరికాలోని స్పేస్ ఏజెన్సీలో 40 సంవత్సరాలు పనిచేసిన సైంటిస్ట్‌ జిమ్ గ్రీన్‌.. తన జీవితకాలంలో ఏలియన్స్‌ను చూస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్య కిరణాలు తాకేంత దూరంలో అనేక గ్రహాలు ఉన్నాయన్నారు. అవి శుక్రుడిలా, అంగార గ్రహంలా ఉన్నాయని చెప్పారు. వాటిలో భూమిలాంటి గ్రహాలు కూడా ఉన్నాయన్నారు. వాటిపై తాగేందుకు నీరు కూడా ఉంటుందని జిమ్ వివరించారు. గ్రహాలు, వాటిపై ఉన్న వాతావరణ పరిస్థితులను గమనించనేదుకు.. ఇటీవల శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలీస్కోప్‌ను నాసా అంతరిక్షంలోకి పంపింది. ఈ టెలీస్కోప్ ద్వారా గ్రహాలపై నీటి జాడలను కనిపెట్టడం తేలిక అవుతుందని..చాలా వరకు గ్రహాల్లో నీరు ఉంటే..జీవం కూడా ఉండే అవకాశం ఉందని జిమ్ గ్రీన్ తెలిపారు. అతి త్వరలోనే మానవులు నిజంగా ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ కు దగ్గరలోనే ఉన్నారని గ్రీన్‌ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Published on: May 24, 2022 04:57 PM