Viral Videos: కొన్ని కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు ప్రమాదం అంచున ఉండి వాలీబాల్ ఆడటం, ఇతర క్రీడలు ఆడటం లాంటివి చేస్తున్న వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్సావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్ అగ్ని పర్వతం ఈనెల 28న బద్దలైంది. అయితే పర్వతంలో నుంచి పెద్ద ఎత్తున లావా బయటకు వస్తోంది. ఆ లావా వేడి తీవ్రత తక్కువగానే ఉండటంతో ఉండటంతో పర్యాటకులు కాస్త దాని దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం కలుగుతుంది. ఆదివారం చాలా మంది హైకర్లు, సందర్శకులు అక్కడికి వెళ్లి దానిని పరిశీలించారు. పర్యాటకులు అగ్ని పర్వతం వద్ద సెల్ఫీలు దిగడం, అగ్ని పర్వతం వద్ద కొంత మంది యువకులు సరదాగా వాలీబాల్ ఆడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రూట్ ఐనార్స్ డోట్టిర్ అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను పోస్టు చేశారు. ‘అగ్నిపర్వతం వద్ద యువకులు సరదగా వాలీబాల్ ఆడుతున్నారు’ అని ఆమె కామెంట్ జతచేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను పదిలక్షల మంది వీక్షించారు. ఆమె మరో వీడియోను షేర్ చేసి.. ‘ ఉదయం ఆగ్ని పర్వతం వద్ద కాఫీ తాగడం చాలా ఆనందంగా ఉంది’ అని కామెంట్ చేశారు. ‘చాలా అద్భుతం’, ‘అక్కడ ఆటలు ఆడటాన్ని నిషేధిస్తారు.. జాగ్రత్త’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే మంచులో కూడా కొందరు వాలీబాల్ అడుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఐస్లాండ్‌లో భూకంపం కారణంగా ఫాగ్రడల్స్ పర్వత అగ్నిపర్వతం బలంగా పేలింది. 800 సంవత్సరాల తరువాత, ఈ అగ్నిపర్వతం నుండి చాలా లావా బయటకు వస్తోంది. పర్వతం మొత్తం అగ్నిగా మారింది. మండుతున్న లావాను చూస్తే, అగ్ని నది ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ అగ్నిపర్వతానికి సంబంధించిన చాలా ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే అగ్నిపర్వతం దగ్గర వారు వాలీబాల్ ఆడుతుండటం చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు.
Biden Government: అమెరికాలో మెరిసిన మరో తెలుగు తేజం.. కీలక పదవికి తెలుగు సంతతి మహిళ నామినేట్