Viral Video: దేశంలోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అయిన హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ స్వింగ్ వీడియోను పంచుకున్నాడు. అందులో అతను తన ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపించాడు. వైరల్ అవుతున్న వీడియోలో పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తన ఉద్యోగులతో కలిసి లావారీస్ చిత్రంలోని ప్రసిద్ధ పాట ‘అప్నీ తో జైసే తైసే’కి డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు.
వీడియోను షేర్ చేస్తూ, హర్ష్ గోయెంకా.. ‘భారతదేశంలో అతిపెద్ద ఐపీవోలలో ఒకదానికి సెబీ ఆమోదం పొందిన తర్వాత పేటీఎం కార్యాలయంలో వేడుకలు’ అంటూ ట్యాగ్ అందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
‘విజయ్ శేఖర్ శర్మ చాలా కూల్ బాస్’ అని కామెంట్ చేశాడు. ‘బ్రదర్ వావ్! మీరు బాస్ అయితే, అలాగే ఉండండి’ అంటూ మరో యూజార్ కామెంట్ చేశాడు. అయితే ఈ వీడియోను హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన తీరు చూస్తుంటే, సెబీ తరపున పేటీఎం నుంచి ఐపీఓ ఆమోదం పొందిన తర్వాత ఈ వీడియో చేసినట్టు అనిపిస్తోంది. అయితే ఈ వీడియో 2018 సంవత్సరానికి చెందినది అని తెలుస్తోంది.
Scenes at Paytm office after SEBI approves one of India’s largest IPOs ??@vijayshekhar pic.twitter.com/6yQHKVBm39
— Harsh Goenka (@hvgoenka) October 24, 2021
Congratulations Vijay Shekhar & entire Paytm team. What a moment for Indian entrepreneurship.
— Pradeep Bhandari(प्रदीप भंडारी)?? (@pradip103) October 24, 2021
I wonder if every boss can be this much cool. @hvgoenka you also dance like this on good news?
— Dhaval M. Khunt (@dkdhavalkhunt) October 24, 2021
#PayTmIPO pic.twitter.com/eXQISFmPE8
— Ajnby (@ajnby) October 24, 2021
Viral Video: చిన్నపిల్లలా మొసలిని ఎత్తుకున్న వ్యక్తి.. వీడియో చూస్తే పొట్ట చక్కలయ్యేలా నవ్వడం ఖాయం.!