ఆక్సిజన్ సిలిండర్తో పోలింగ్ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం
ఓటు వజ్రాయుధం లాంటిది. నాయకుల రాతలనే కాదు, దేశ ప్రజల తలరాతలను మార్చగల శక్తి ఈ అస్త్రం సొంతం. ఐదేళ్ళకోసారి ఈఅస్త్రాన్ని ప్రయోగించే అవకాశం కలుగుతుంది. ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. తమ ఓటుతో సరైన నేతను ఎన్నుకోవాలి. అందుకే ఓటు విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ ఓటును వినియోగించుకుంటారు. శతాధిక వృద్ధులే కాదు, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉన్నవారు కూడా కదిలి వచ్చి పోలింగ్ బూత్‌లో తమ హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వజ్రాయుధం లాంటిది. నాయకుల రాతలనే కాదు, దేశ ప్రజల తలరాతలను మార్చగల శక్తి ఈ అస్త్రం సొంతం. ఐదేళ్ళకోసారి ఈఅస్త్రాన్ని ప్రయోగించే అవకాశం కలుగుతుంది. ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. తమ ఓటుతో సరైన నేతను ఎన్నుకోవాలి. అందుకే ఓటు విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ ఓటును వినియోగించుకుంటారు. శతాధిక వృద్ధులే కాదు, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉన్నవారు కూడా కదిలి వచ్చి పోలింగ్ బూత్‌లో తమ హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయకుండా తమ హక్కును నిర్లక్ష్యం చేస్తున్న ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు. తెలంగాణలో నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు. వీరిలో వృద్ధులే ఎక్కవగా కనిపించారు. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య ఆక్సిజన్ సిలిండర్తో పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు.. సమీపంలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు
వావ్ !! ఓటీటీలోకి పొలిమేర2 డేట్ కన్ఫర్మ్
Allu Arjun: లేడీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్
మా ఆయన చనిపోలేదు.. నమ్మొద్దు !! విజయ్‌కాంత్ భార్య ఎమోనల్
రికార్డ్ బద్దల్ ఖాయం.. దిమ్మతిరిగేలా చేస్తున్న యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్