యువకుడిని కొట్టి రైలు నుంచి తోసివేత.. కారణం తెలిస్తే షాక్‌

|

Dec 26, 2022 | 9:57 AM

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఓల్డ్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ లో ఓ యువకుడిని ప్రయాణికులు చితకబాదారు. అనంతరం కదులుతున్న రైలులో నుంచి తోసేశారు.

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఓల్డ్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ లో ఓ యువకుడిని ప్రయాణికులు చితకబాదారు. అనంతరం కదులుతున్న రైలులో నుంచి తోసేశారు. ఈ ఘటనలో యువకుడు మరణించాడు. తన మొబైల్ పోయిందని ఓ మహిళ షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే లక్నోలో ట్రైన్ ఎక్కిన యువకుడు ఫోన్ దొంగతనం చేశాడని ప్రయాణికులు అనుమానించారు. దీంతో అతడిని పట్టుకొని దాదాపు అరగంట పాటు చితకబాదాడు. ఇంకా కోపం చల్లారకపోవడంతో నడుస్తున్న ట్రైన్ నుంచి అతడిని తోసేశారు. దీంతో ట్రాక్ పక్కన ఉన్న లైన్ స్తంభానికి ఆ యువకుడి తల తగలడంతో తీవ్ర గాయమైంది. అలాగే ఓ కాలు కూడా తెగిపోయింది. దీంతో అతడు మరణించాడు. అయితే ఈ ఘటనను పలువురు ప్రయాణికులు వీడియో తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్‌లైన్‌ బడ్డీకి ముద్దులు.. చైనా డేటింగ్‌లో కొత్త ట్రెండ్‌..

వామ్మో.. అది హెయిర్ స్టైలా ?? ఈఫిల్ టవరా ??

పెళ్లి వేదికపై అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న వరుడు !! హృతిక్‌ రోషన్‌ అంటున్న నెటిజన్స్ !!

గాళ్‌ఫ్రెండ్ కోసం యువకుడి పాట్లు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

మైకేల్ జాక్సన్‌కే మతిపోయేలా ఆటోవాలాల స్టెప్పులు !! అదరహో అనాల్సిందే !!

 

Published on: Dec 26, 2022 09:57 AM