కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకు పొంచి ఉన్న ముప్పు

|

Mar 19, 2024 | 7:43 PM

నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో వీధి శునకాలకు కొత్త వైరస్ సోకింది. గ్రామాల్లోని పదుల సంఖ్యలో కుక్కలు దీనిబారిన పడ్డాయి. పార్వో వైరస్ గా వ్యవహరించే ఈ వ్యాధి కారణంగా కుక్కల్లో బొబ్బలు వచ్చి, చీము, రక్తం కారతాయి. వైరస్ బారిన పడ్డ కుక్కలు యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతుండడంతో మనుషులకూ వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు వీధుల్లో ఆడుకునే సమయంలో కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో వీధి శునకాలకు కొత్త వైరస్ సోకింది. గ్రామాల్లోని పదుల సంఖ్యలో కుక్కలు దీనిబారిన పడ్డాయి. పార్వో వైరస్ గా వ్యవహరించే ఈ వ్యాధి కారణంగా కుక్కల్లో బొబ్బలు వచ్చి, చీము, రక్తం కారతాయి. వైరస్ బారిన పడ్డ కుక్కలు యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతుండడంతో మనుషులకూ వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు వీధుల్లో ఆడుకునే సమయంలో కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. వైరస్ కారణంగా వీధి శునకాలకు చీము, రక్తం కారుతుండడం, వాటిపై వాలిన ఈగలు ఇళ్లల్లోని ఆహార పదార్థాలపై వాలితే ముప్పు తప్పదని అంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఆ కుక్కలను తరలించాలని కోరుతున్నారు. పల్తితండాలో పార్వో వైరస్ బారిన పడ్డ కుక్కల బెడద ఎక్కువగా ఉందని తండా వాసులు చెబుతున్నారు. తండాలో దాదాపు డెబ్బై కుక్కల వరకు ఉన్నాయని, వాటిలో సగానికి పైగా కుక్కలు వైరస్ బారిన పడ్డాయని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెట్టింట చక్కర్లు కొడుతున్న మెగాస్టార్‌ టెన్త్‌ సర్టిఫికెట్‌.. పాసయ్యరా ??

అడుగు దూరంలో.. మూడో ప్రపంచ యుద్ధం

తీరని విషాదం.. అత్త మరణం తట్టుకోలేక ఆగిన కోడలు గుండె

స్కిన్‌ ఎలర్జీతో బాధపడుతున్నారా ?? చిన్నపాటి మార్పులతో చెక్‌ పెట్టండి

క్లాస్‌ రూమ్‌లో ఐటమ్‌ సాంగ్‌కు టీచర్‌ డాన్స్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో