అంత్యక్రియల పేరుతో మోసం శవాలను దాచేసి.. చితాభస్మంగా బూడిద ఇచ్చారు
మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తామని తీసుకొని వాటిని పక్కన పడేసి.. చితాభస్మం కింద ఏదో బూడిదను ఇచ్చి మోసం చేసింది ఓ సంస్థ. చాలామంది అది తమ ఆత్మీయులవే అనుకొని ఇంట్లో ఏళ్ల తరబడి భద్రపర్చుకున్నారు. మోసం విషయం బయటపడి బాధితులు కోర్టును ఆశ్రయించడంతో సదరు సంస్థకు ఏకంగా 7 వేల 971 కోట్ల రూపాయిల ఫైన్ విధించారు. అమెరికాలోని కొలరాడోలో ఈ దారుణం జరిగింది. ‘రిటర్న్ టూ నేచర్’ అనే సంస్థ 2016లో ప్రారంభమైంది.
మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తామని తీసుకొని వాటిని పక్కన పడేసి.. చితాభస్మం కింద ఏదో బూడిదను ఇచ్చి మోసం చేసింది ఓ సంస్థ. చాలామంది అది తమ ఆత్మీయులవే అనుకొని ఇంట్లో ఏళ్ల తరబడి భద్రపర్చుకున్నారు. మోసం విషయం బయటపడి బాధితులు కోర్టును ఆశ్రయించడంతో సదరు సంస్థకు ఏకంగా 7 వేల 971 కోట్ల రూపాయిల ఫైన్ విధించారు. అమెరికాలోని కొలరాడోలో ఈ దారుణం జరిగింది. ‘రిటర్న్ టూ నేచర్’ అనే సంస్థ 2016లో ప్రారంభమైంది. దీనిని 2021లో జాన్, క్యారీ హాల్‌ఫోర్డ్‌లు కొన్నారు. ఆ తర్వాత సంస్థపై పలు కేసులు నమోదయ్యాయి. 2023లో ఈ సంస్థ ప్రాంగణాన్ని తనిఖీ చేయగా 190 మృతదేహాలు కుళ్లిన స్థితిలో అధికారుల కంటపడ్డాయి. అక్కడినుంచి వాటిని వేరే చోటుకు తరలించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. పరారీలో ఉన్న జాన్, క్యారీ హాల్‌ఫోర్డ్‌లను నవంబర్‌లో ఓక్లహామాలో అరెస్టు చేశారు. బాధితుల కుటుంబాల నుంచి 1,30,000 డాలర్లు సొమ్ము వసూలుచేసినట్లు గుర్తించారు. వారిపై పన్ను ఎగవేత నేరాలు కూడా ఉన్నాయి. దీనికితోడు కొవిడ్ సమయంలో 9,00,000 డాలర్ల సహాయనిధిని కూడా వీరు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. కార్లు, ఖరీదైన ట్రిప్పులకు ఈ సొమ్మును ఖర్చు చేసినట్లు గుర్తించారు. చివరికి క్రిప్టోల్లో కూడా పెట్టుబడులు పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొప్ప మనసు చాటుకున్న “మల్లు అర్జున్” వయనాడ్ బాధితుల కోసం విరాళం
మహిళ తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Palvancha: పాల్వంచలో ఎత్తైన టవర్లను ఎలా కూల్చేశారో చూడండి
ఈ అందాన్ని చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాలా
Indian Railways: ఆన్ డ్యూటీ అయినా సరే టికెట్ ఉండి తీరాల్సిందే