వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీసులకే మస్కా కొట్టి జంప్‌

Updated on: Nov 26, 2025 | 4:48 PM

ఒంగోలు సీసీఎస్‌ పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు మైనర్ బైక్ దొంగలు అత్యంత తెలివిగా తప్పించుకున్నారు. తాళాలతోనే బేడీలు విప్పి, చీపురు పుల్లతో గోడకు ఉన్న స్టేషన్ తాళాలు లాక్కొని పరారయ్యారు. సెంట్రీ కానిస్టేబుల్ ఫోన్‌లో మునిగిపోయిన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.

ఒంగోలు సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుంచి ఇద్దరు నిందితులు పోలీసుల కళ్ళు కప్పి సినీ ఫక్కీలో పరారయ్యారు. పలు బైకులు చోరీ చేసిన కేసుల్లో ఒంగోలు నగరానికి చెందిన ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 5 మోటార్ బైకులు రికవరీ కూడా చేశారు. అయితే ఈ ఇద్దరు కుర్రాళ్లు పోలీసులకే టోకరా ఇచ్చి జంప్‌ అయిపోయారు. ఒంగోలు నగరంలో గత కొన్ని రోజులుగా వరుసగా బైకు చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం పదహారేళ్ల వయసున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ దొంగలు పోలీసుల కళ్లు గప్పి తమకు పోలీసులు వేసిన తాళాలతోనే బేడీలు విప్పేసుకుని ఉడాయించారు. ఎలా అంటే.. నిందితులిద్దరినీ సర్వేలెన్స్‌ రూములో ఉంచి తాళాలు వేసి పక్కనే గోడకు తగిలించి బయటకు వెళ్లారు పోలీసులు. స్టేషన్లో ఎవరూ లేకపోవడంతో ఇద్దరు నిందితులు వారి రూములో ఉన్న చీపురునుంచి పుల్లను తీసుకొని దానికి దారం కట్టి గోడకు ఉన్న తాళాలను జాగ్రత్తగా అందిపుచ్చుకున్నారు. ఇంకేముంది తాళంతో సెల్‌ ఓపెన్‌ చేసి, తాళాలు అక్కడే పడేసి పారిపోయారు. వీరు పారిపోతున్న సమయంలో సెంట్రీ గా ఉన్న కానిస్టేబుల్ ఆంజనేయులు సెల్ఫోన్లో వీడియోలు చూడ్డంలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ గతంలో గంజాయి సేవిస్తూ చోరీలకు పాల్పడుతున్న నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనతో బిత్తరపోయిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

100 కోట్ల సంపాదనతో.. అత్యంత లగ్జరీగా బతికిన ఐ -బొమ్మ రవి

నల్లమలలో జంగిల్‌ సఫారీ.. ఎదురుగా పెద్దపులి.. కట్ చేస్తే

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్ష కొలువుల భర్తీకి రంగం సిద్ధం

మానవ బంధాలన్నీ.. ఆర్ధిక సంబంధాలే.. సోదరి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించి మరీ..

వీళ్లు అమ్మాయిలా.. ఆటం బాంబులా.. రీల్స్ కోసం మరి ఇంతకి తెగించారా.. బాబోయ్