Road bridge :భార్య నగలు తాకట్టుపెట్టి సొంతూరికి రోడ్డు, బ్రిడ్జి నిర్మించిన తండ్రీకొడుకులు..!వీడియో..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు కేటాయిస్తున్నా.. ఇప్పటికీ మౌలిక సదుపాయలు లేక జనం అల్లాడుతున్నారు. అయితే, రాకపోకల్లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలను చూసి ఓ డ్రైవర్ ఏకంగా...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు కేటాయిస్తున్నా.. ఇప్పటికీ మౌలిక సదుపాయలు లేక జనం అల్లాడుతున్నారు. అయితే, రాకపోకల్లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలను చూసి ఓ డ్రైవర్ ఏకంగా వంతెననే ఏర్పాటు చేశారు. ఉపాధిని వదులుకొని, భార్య నగలు తాకట్టు పెట్టి మరీ ఊరి కోసం పాటుపడ్డారు. ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితి పరిధిలో తండ్రీ కొడుకుల ఔదార్యం వెలుగులోకి వచ్చింది. డొంగశిలి పంచాయతీలోని గుంజరం పంజరి గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ డ్రైవర్‌గా పని చేసేవారు. 120 కుటుంబాలు నివసించే గుంజరం పంజరి బిచులి నదికి అవతల ఉంది. ఏ అవసరం వచ్చినా నదిలో దిగి వెళ్లాలి. అత్యవసర సమయంలో వైద్యం అందక పలువురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. అది చూసిన రంజిత్ నదిపై వంతెన నిర్మించాలనుకున్నారు. ఉపాధిని పక్కన పెట్టి, భార్య బంగారాన్ని తాకట్టు పెట్టారు. వచ్చిన 70 వేల రూపాయలతో కర్రలతో వంతెన నిర్మిస్తానని తండ్రికి చెప్పారు. కుమారుడి లక్ష్యం నచ్చిన ఆ పెద్దాయనా అతనికి సాయంగా పనిలోకి దిగారు. ఇద్దరూ కలసి నదిపై కర్రల వంతెన నిర్మించారు. నది దగ్గర నుంచి ఊరిలోకి వెళ్లేందుకు పొదలు తొలగించి, 4 కిలో మీటర్ల మేర మట్టి రోడ్డు వేశారు. నాలుగు నెలలు శ్రమించి గ్రామానికో రోడ్డేశారు. ఊరికి దారి వేయాలని అధికారులు చుట్టూ తిరిగి అలసిపోయా. అందుకే కర్రల వంతెన, రోడ్డు నిర్మించానని రంజిత్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

