Chennai gambler: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో చీకటి వ్యాపారం.. హద్దు మీరుతున్న ఆగడాలు..!
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో పేకాట క్లబ్ ఆగడాలు హద్దు మీరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పేకాటపై నిషేధం విధించడంతో పక్క రాష్ట్రాలకు పేకాటరాయుళ్లు వలస బాట పడుతున్నారు.
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో పేకాట క్లబ్ ఆగడాలు హద్దు మీరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పేకాటపై నిషేధం విధించడంతో పక్క రాష్ట్రాలకు పేకాటరాయుళ్లు వలస బాట పడుతున్నారు. తిరువళ్లూరు జిల్లా ఎగుమధురలో పేకాట క్లబ్ ఏర్పాటు చేశారు ఏపీకి చెందిన వ్యక్తులు. ఏపీలో అనుమతులు లేకపోవడంతో సరిహద్దుల్లో ఈ క్లబ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తమకు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల సపోర్ట్ ఉందంటున్న నిర్వాహకులు.. తిరుపతి జిల్లా శ్రీసిటీకి సమీపంలో క్లబ్ నిర్వహిస్తున్నారు. విజయవాడ గుంటూరు నుంచి సైతం నెల్లూరు మీదుగా తమిళనాడుకు చేరుకుంటున్నారు పేకాట రాయుళ్లు. ఇక్కడ పేకాట క్లబ్‌లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు రోజు కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో సమీప గ్రామాల్లో హంగామా నెలకొంది. దీనిపై గ్రామస్తులు నిలదీయడంతో వారిపై దాడులకు తెగబడ్డారు. పేకాట క్లబ్ నిర్వాహకుల ఆగడలపై ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే స్థానికుల పైనే దాడికి తెగబడుతున్నారు. శ్రీసిటీ మీదుగా క్లబ్‌కు వెళుతున్న పేకాట రాయుళ్లు.. సరిహద్దు గ్రామాల్లో హంగామా సృష్టిస్తున్నారు. వీరి ఆగడాలు భరించలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తే కోట్లలో జరుగుతున్న ఈ చీకటి వ్యాపారానికి తెర దించాలంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

