బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
చైనాలో జరిగిన ఓ సంఘటనలో నర్సు నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు తన మధ్య వేలును కోల్పోయింది. ప్రసవానంతరం బొడ్డుతాడు కత్తిరించే క్రమంలో నర్సు పొరపాటున శిశువు వేలును కత్తిరించింది. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం నర్సును సస్పెండ్ చేయడంతో పాటు బాధితులకు రూ. 12.95 లక్షల పరిహారం అందించింది. శిశువుకు వేలును తిరిగి అతికించేందుకు శస్త్రచికిత్స జరిగింది.
చైనాలో నర్సు నిర్లక్ష్యం కారణంగా ఓ నవజాత శిశువు తన వేలును కోల్పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జూయి కౌంటీ పీపుల్స్ హాస్పిటల్‌లో డిసెంబర్ 25న ఓ మహిళకు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగింది. ప్రసవానంతరం శిశువుకు బొడ్డుతాడు కత్తిరించే క్రమంలో, నర్సు పొరపాటున శిశువు మధ్య వేలును కత్తిరించింది. దీంతో పుట్టిన వెంటనే శిశువు తన వేలును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. శిశువు వేలును తిరిగి అతికించడం కోసం 300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం :
