ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తున్నారా ?? ఆ టైమ్ లో అయితే నో ఫైన్ ??
రోడ్డుపై అంబులెన్స్ వస్తున్నప్పుడు ఎంతటి ట్రాఫిక్ ఉన్నా వాహనదారులంతా పక్కకు తప్పుకొని అంబులెన్స్‌కు దారి ఇస్తారు. ఒక్కోసారి వాహనదారులు అంబులెన్స్ దారి ఇచ్చే క్రమంలో సిగ్నల్‌ను జంప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో, ఆ సమయంలో ట్రాఫిక్ నిబంధనలన్నీ పక్కన పెట్టేస్తారు. కానీ ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా సిగ్నల్ జంప్ కారణంగా వారి వాహనాలకు ఫైన్ పడుతుంటుంది.
రోడ్డుపై అంబులెన్స్ వస్తున్నప్పుడు ఎంతటి ట్రాఫిక్ ఉన్నా వాహనదారులంతా పక్కకు తప్పుకొని అంబులెన్స్‌కు దారి ఇస్తారు. ఒక్కోసారి వాహనదారులు అంబులెన్స్ దారి ఇచ్చే క్రమంలో సిగ్నల్‌ను జంప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో, ఆ సమయంలో ట్రాఫిక్ నిబంధనలన్నీ పక్కన పెట్టేస్తారు. కానీ ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా సిగ్నల్ జంప్ కారణంగా వారి వాహనాలకు ఫైన్ పడుతుంటుంది. ఈ నేపథ్యంలో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు మహానగరంలో అంబులెన్స్ కు దారి ఇచ్చే క్రమంలో… వాహనదారులు సిగ్నల్ జంపింగ్ చేస్తే ఇకపై జరిమానా విధించకూడదని నిర్ణయించారు. ఒకవేళ, అంబులెన్స్ కు దారి ఇచ్చే క్రమంలో సిగ్నల్ జంపింగ్ చేసిన వారికి ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా జరిమానా విధిస్తే… ఆ వాహనదారులు ఇన్ ఫాంట్రీ రోడ్ లో ఉన్న ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సెంటర్ ను సంప్రదించాలని బెంగళూరు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అంతేకాదు, కర్ణాటక స్టేట్ పోలీస్ (KSP) యాప్ ద్వారా కూడా తమ జరిమానా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని వివరించింది. కాగా, అంబులెన్స్ లు ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్న సమయంలో సిగ్నల్ లైటు ఆటోమేటిగ్గా ఎరుపు రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారేలా జియో ఫెన్సింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ మేరకు 80 అంబులెన్స్ లకు జీపీఎస్ ను అమర్చినట్టు అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడి
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
Taapsee Pannu: అనంత్ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్ చూసి షాక్ !!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

