కాకిని పట్టుకుని కట్టేసిన దుకాణదారుడు !! నిరసనగా దండెత్తిన వందలాది కాకులు
ఎవరైనా ఏదైనా దక్కించుకోడానికి వెంటపడి వెంటపడి అదేపనిగా విసిగిస్తుంటే.. అబ్బా.. ఆపు నీ కాకిగోల అంటుంటారు.. కానీ ఆ కాకిగోల వెనక ఓ పట్టుదల ఉంటుంది. అంతేకాదు, కాకుల్లో... మనుషులు నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కాకులు ఐకమత్యంగా ఉంటాయి. ఎన్నో విలువలు కలిగి ఉంటాయి. వాటి జీవనశైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో శుభ్రతను పాటిస్తాయి. ఏదైనా ఓ కాకికి ఆపద వస్తే అన్ని కాకులు అక్కడికి చేరి గోల గోల చేస్తాయి.
ఎవరైనా ఏదైనా దక్కించుకోడానికి వెంటపడి వెంటపడి అదేపనిగా విసిగిస్తుంటే.. అబ్బా.. ఆపు నీ కాకిగోల అంటుంటారు.. కానీ ఆ కాకిగోల వెనక ఓ పట్టుదల ఉంటుంది. అంతేకాదు, కాకుల్లో… మనుషులు నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కాకులు ఐకమత్యంగా ఉంటాయి. ఎన్నో విలువలు కలిగి ఉంటాయి. వాటి జీవనశైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో శుభ్రతను పాటిస్తాయి. ఏదైనా ఓ కాకికి ఆపద వస్తే అన్ని కాకులు అక్కడికి చేరి గోల గోల చేస్తాయి. దానికి తాము అండగా ఉన్నామని భరోసానిస్తాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెబుతున్నామంటే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మాంసం దుకాణదారు ఓ కాకిని కట్టేశాడు. అది తెలుసుకున్న మిగతా కాకులు వందలాదిగా అక్కడికి చేరి తమ నిరసన తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని తాటిపాక మార్కెట్లోని చికెన్ షాపు దగ్గర ఓ కాకి ఉదయం నుంచి ఆ షాపులో మాంసం వ్యర్ధాలను ఎత్తుకుపోడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో దుకాణదారుడిని చాలా విసిగించింది. ఎలాగైనా ఆ కాకిని పట్టుకోవాలనుకున్న అతను అదను చూసి పట్టేసుకున్నాడు. ఆ తర్వాత దానిని ఓ తాడుతో అక్కడ స్తంభానికి కట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా వందలాది కాకులు చికెన్ షాపు పై దండెత్తి షాపు చుట్టూ తిరుగుతూ గోల చేస్తూ నిరసన తెలిపాయి. తమ తోటి కాకిని వదిలే వరకూ తగ్గేదే లేదంటూ ఎంత బెదిరించినా అవి వెనక్కిపోలేదు. కావు కావు మని అరుపులతో గోల గోల చేశాయి. ఈ గోలను భరించలేని మిగిలిన దుకాణదారులు కట్టేసిన కాకిని వదిలేయాలని కోరారు. దాంతో దుకాణదారు కాకిని వదిలిపెట్టేశాడు. అక్కడున్నవారంతా కాకుల ఐక్యతకు ఆశ్చర్యపోయారు. ఇంతటి ఐక్యత మనుషులకు లేకపోయిందే అని ముక్కున వేలేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తున్నారా ?? ఆ టైమ్ లో అయితే నో ఫైన్ ??
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్
సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు
కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి
కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం
క్లాస్ రూమ్‌లో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. కట్ చేస్తే
ఫిట్స్ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్
కాలేజ్ బాత్రూమ్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్

