అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్ చూసి షాక్ !!
పూల తోటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు... అయితే అతను గంజాయి సాగు చేసేది వ్యాపారం చేయడానికి కాదు.. తన కోసమే తన పూలతోటల్లో గంజాయి సాగు చేస్తున్నాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో అక్రమ మద్యం ఉందని ఓ ఆకాశ రామన్న.. సెబ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదేంటో చూద్దామని వెళ్లిన సెబ్ పోలీసులు అక్కడ జరుగుతున్నది చూసి కంగుతిన్నారు.
పూల తోటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు… అయితే అతను గంజాయి సాగు చేసేది వ్యాపారం చేయడానికి కాదు.. తన కోసమే తన పూలతోటల్లో గంజాయి సాగు చేస్తున్నాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో అక్రమ మద్యం ఉందని ఓ ఆకాశ రామన్న.. సెబ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదేంటో చూద్దామని వెళ్లిన సెబ్ పోలీసులు అక్కడ జరుగుతున్నది చూసి కంగుతిన్నారు. పూల తోటకు కాపలాగా ఉన్న వన్నూరు స్వామి అనే వ్యక్తి బంతిపూలు, కనకాంబరాల పూల చెట్ల మధ్య నాలుగు గంజాయి మొక్కలను అపురూపంగా పెంచుకుంటున్నాడట. అందరూ పూల వాసన పీలుస్తుంటే.. మనోడు గంజాయి పీలుస్తున్నాడు. పూల తోటలో గంజాయి సాగు చేస్తున్న తోటమాలి వన్నూరు స్వామి రోజుకు ఓ నాలుగు ఆకులు తెంపుకొని గంజాయి సేవిస్తున్నాడు. ఈ విషయం చుట్టుపక్కల రైతులు చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారా???? లేక మనోడే గంజాయి మత్తులో ఎక్కడైనా వాగాడో తెలియదు గానీ మొత్తానికి పూల తోటలో గంజాయి సాగు బండారం బయటపడింది. అక్రమ మద్యం ఉందని సమాచారం వస్తే ఏకంగా గంజాయి సాగు పోలీసుల కంటబడింది. పూల తోటలో ఓ నాలుగు గంజాయి మొక్కలను సెబ్ పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ మొక్కలు తొలగించి…. దాదాపు 7.25 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తోటమాలి వన్నూరు స్వామిని అరెస్ట్ చేశారు. తన పూలతోటలో గంజాయి పండిస్తున్న విషయం ఆ తోట యజమానికి కూడా తెలియకుండా మేనేజ్ చేశాడు మనోడు. మరి పోలీసులకెలా తెలిసిందా అని షాకయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉదయాన్నే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా ??
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా ??
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

