ఛాతిలో బాణం దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడిని నిమ్స్ వైద్యులు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల సోది నంద అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో బాణం దిగింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. వైద్యులు తొలుత యువకుడికి సిటీ స్కాన్ చేశారు. ఊపిరితిత్తుల పక్క నుంచి గుండెలోకి బాణం గుచ్చుకున్నట్టు గుర్తించారు. అప్పటికే భారీగా రక్తస్రావం కావడంతో యువకుడికి రక్తం ఎక్కిస్తూనే ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు. బాణం దిగిన చోట రక్తం గడ్డకట్టడంతో అధిక రక్తస్రావం కాలేదని, దీంతో యువకుడి ప్రాణాలు నిలిచాయని వైద్యులు అన్నారు. యువకుడు బలవంతంగా బాణం బయటకు తీసి ఉంటే రక్తస్రావమై ప్రాణాలు పోయి ఉండేవని అన్నారు. ఆపరేషన్ ఉచితంగా చేశామని కూడా వెల్లడించారు. కాగా, శస్త్రచికిత్స చేసిన డా. అమరేశ్వరరావు వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: డీజే టిల్లు పాటకు పోలీసుల డ్యాన్స్ అదిరిందిగా
వాయిస్ మార్ఫింగ్ యాప్‌తో వల.. ఏడుగురిపై లైంగికదాడి
5 నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు
TOP 9 ET News: దీపిక తీరుతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం | పోలీసులకు హేమ బిగ్ ఝలక్
హీరోయిన్‌ను దారుణంగా చంపిన తండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు