New Ration Cards in Telangana: తెలంగాణాలో స్మార్ట్‌ కార్డ్‌ తరహాలో కొత్త రేషన్‌ కార్డులు..

|

May 25, 2024 | 4:21 PM

తెలంగాణ స్టేట్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆహార భద్రత కార్డుల డిజైన్‌ను మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో.. ‘టీజీ’ ప్రింట్‌తో కొత్తగా స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త రేషన్‌ కార్డులు సరికొత్తగా బార్ కోడ్‌తో.. ఈజీ యాక్సెస్ చేసేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొత్త కార్డు స్వరూపంపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ స్టేట్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆహార భద్రత కార్డుల డిజైన్‌ను మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో.. ‘టీజీ’ ప్రింట్‌తో కొత్తగా స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త రేషన్‌ కార్డులు సరికొత్తగా బార్ కోడ్‌తో.. ఈజీ యాక్సెస్ చేసేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొత్త కార్డు స్వరూపంపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, స్క్రూటినీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ గడువు పూర్తి కాగానే కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతమున్న రేషన్ కార్డుల రూపం మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి పది లక్షలకు పెంచారు. దీంతో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కొత్తగా మంజూరు చేసే రేషన్‌ కార్డు రూపం పూర్తిగా మార్చాలనే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త కార్డులో ఎలాంటి వివరాలు పొందుపరచాలి అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on