బడా హోటళ్లలోని రుచికరమైన ఫుడ్‌ వెనుక అసలు రహస్యం ఇదే

బడా హోటళ్లలోని రుచికరమైన ఫుడ్‌ వెనుక అసలు రహస్యం ఇదే

Phani CH

|

Updated on: May 25, 2024 | 11:36 AM

వీకెండ్‌ వస్తే బయటి ఫుడ్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారా? స్పెషల్ డే అంటూ పరిగెత్తుకుని వెళ్లి పేరుమోసిన రెస్టారెంట్స్‌లో వాలిపోతున్నారా...? ఫ్యామిలీని తీసుకుని వెళ్లి మరి ఎంచక్కా ఆరగిస్తున్నారా...? బీ అలర్ట్‌. నగరంలోని పెద్ద రెస్టారెంట్లు సైతం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. వీకెండ్ వస్తే హైదరాబాదీలు రెస్టారెంట్ల మీద పడిపోతారు. లంచ్, డిన్నర్ అన్నీ హోటళ్లలోనే కానిచ్చేస్తారు. రకరకాల పేర్లతో ఉన్న రెస్టారెంట్స్‌కు వెళ్లి అన్నీ ఫ్లేవర్స్‌ కవర్ చేస్తారు.

వీకెండ్‌ వస్తే బయటి ఫుడ్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారా? స్పెషల్ డే అంటూ పరిగెత్తుకుని వెళ్లి పేరుమోసిన రెస్టారెంట్స్‌లో వాలిపోతున్నారా…? ఫ్యామిలీని తీసుకుని వెళ్లి మరి ఎంచక్కా ఆరగిస్తున్నారా…? బీ అలర్ట్‌. నగరంలోని పెద్ద రెస్టారెంట్లు సైతం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. వీకెండ్ వస్తే హైదరాబాదీలు రెస్టారెంట్ల మీద పడిపోతారు. లంచ్, డిన్నర్ అన్నీ హోటళ్లలోనే కానిచ్చేస్తారు. రకరకాల పేర్లతో ఉన్న రెస్టారెంట్స్‌కు వెళ్లి అన్నీ ఫ్లేవర్స్‌ కవర్ చేస్తారు. ఇలా బయట తినే హైదరాబాదీలు అలర్ట్‌ అవ్వాల్సిన టైమ్‌ వచ్చింది. పెద్దపెద్ద హోటల్స్‌, రెస్టారెంట్స్‌లోనూ నాణ్యతలేని ఫుడ్ వండి వార్చుతున్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బయట తినే ముందు బీ అలర్ట్‌ అంటూ హెచ్చరిస్తున్నారు. గతకొన్ని రోజులుగా నగరంలో ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ ఫోర్స్‌ బృందం ప్రముఖ హోటల్స్‌ అండ్ రెస్టారెంట్స్‌లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు హోటళ్లను సీజ్‌ చేసిన అధికారులు… లేటెస్ట్‌గా నాణ్యతలేని ఫుడ్‌ పెడుతున్న 24 పెద్ద రెస్టారెంట్స్‌ను గుర్తించారు. వాటిలోని ఆహార పదార్ధాలు టెస్ట్‌ చేసేందుకు శాంపుల్స్‌ను నాచారం ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్ట్స్‌ ఆధారంగానే కల్తీ ఫుడ్‌ పెడుతున్న రెస్టారెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అలాగే స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్మే ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రమైన స్థలంలో, కల్తీ లేని ఆహారం విక్రయించాలంటూ వారికి అవగాహన కల్పించారు. వందల సంఖ్యలో హోటళ్లను తనిఖీలు చేసిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లను సీజ్‌ చేశారు. ఐస్‌క్రీమ్‌ పార్లర్లు, బేకరీల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో !! పిరమిడ్స్ నిర్మాణం వెనుక ఇంత టెక్నాలజీ ఉందా ??

అమెరికాలో విజయవాడకు చెందిన తొలి తెలుగు జడ్జి

ఆ 3 దేశాల దృష్టిలో పాలస్తీనా ఇక స్వతంత్ర దేశం

PM Modi Biopic: మోదీ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన నటుడు సత్యరాజ్‌

Trump Biopic: ట్రంప్‌ బయోపిక్‌లో మొదటి భార్యపై లైంగికదాడి సీన్‌