Viral: బాల్కనీపై చిన్నారి వీడియో వైరల్.. ‘ట్రోల్స్’​ తట్టుకోలేక తల్లి ఆత్మహత్య.

కోయంబత్తూరులో ట్రోలింగ్‌ చేస్తున్నారని మనస్తాపం చెందిన రమ్య అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ పై ఫ్లోర్‌ ప్లాస్టిక్ షీట్‌కు ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడిన వీడియో వైరల్‌గా మారింది. ఇదే ఘటనపై నెటిజన్ల రెస్పాన్స్‌ ఇప్పుడా బిడ్డకు తల్లిని దూరం చేసింది. నెట్టింట విమర్శలు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది.

Viral: బాల్కనీపై చిన్నారి వీడియో వైరల్.. 'ట్రోల్స్'​ తట్టుకోలేక తల్లి ఆత్మహత్య.

|

Updated on: May 25, 2024 | 7:57 PM

కోయంబత్తూరులో ట్రోలింగ్‌ చేస్తున్నారని మనస్తాపం చెందిన రమ్య అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ పై ఫ్లోర్‌ ప్లాస్టిక్ షీట్‌కు ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడిన వీడియో వైరల్‌గా మారింది. ఇదే ఘటనపై నెటిజన్ల రెస్పాన్స్‌ ఇప్పుడా బిడ్డకు తల్లిని దూరం చేసింది. నెట్టింట విమర్శలు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఏప్రిల్‌ 28న చెన్నైలో ఓ 8 నెలల చిన్నారి అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ రేకులపై ప్రమాదకరంగా వేలాడింది. ఆ చిన్నారిని అపార్ట్‌మెంట్ వాసులు రక్షించిన వీడియో వైరల్‌ అయింది. సిసింద్రీ సినిమాలో లాగా ప్రమాదకరచోటుకు పాకుతూ వెళ్లిన ఆ శిశువును, కింద దుప్పట్లు పరచి స్థానికులు రక్షించారు. దీంతో పాపను రక్షించిన వారిని ప్రశంసించిన నెటిజన్లు, చిన్నారి తల్లి విషయంలో తిట్లకు దిగారు. పసిబిడ్డను చూసుకోవడం చేత కాదా అంటూ తల్లి రమ్యను ఆడిపోసుకున్నారు. పాపను అలా నిర్లక్ష్యంగా వదిలేసినందువల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కోపం ప్రదర్శించారు.

ఘటన తర్వాత డిప్రెషన్‌కు లోనైన రమ్య, కోయంబత్తూరులోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య, ఆదివారం ఇంట్లోని కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. వారు తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. ట్రోల్స్‌ కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయిందని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అన్నారు. ఈ విషయంలో చుట్టుపక్కల వారు ఆమెకు అండగా నిలిచారు. తన బిడ్డను బాగా చూసుకుంటుందని, అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయని సపోర్ట్‌గా నిలిచారు. ఘటనపై గాయని చిన్మయి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. కొందరు నెటిజన్లు విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యల వల్లే ఆ చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుందన్నారు. ‘మీ ట్రోల్స్‌ వల్ల చిన్నారి తల్లి మరణించింది. ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్