Traffic Police: ట్రాఫిక్ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టం అనిపించదు. అదే నిరూపించాడు ఓ ట్రాఫిక్ పోలీసు. ట్రాఫిక్ పోలీసు ఉద్యోగం అంటే ఎండైనా, వానైనా నడిరోడ్డులో నిలబడి విధులు నిర్వహించాలి. విధుల్లో ఉన్నంతసేపూ నిలబడే ఉండాల్సి ఉంటుంది. అయినా ఎలాంటి విసుగు చెందకుండా ఎంతో హుషారుగా విధులు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ ట్రాఫిక్ పోలీసు. ఈ ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన వీడియో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

గంటల కొద్ది రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలంటే ఎంతో కష్టమనే చెప్పొచ్చు. కానీ, ఓ ట్రాఫిక్ పోలీసు మాత్రం ఎలాంటి నీరసం, విసుగు లేకుండా తన విధులను ఎంతో ఆస్వాదిస్తున్నాడు. రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ వచ్చి పోయే వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నాడు. అతడు తన పనిని ఆస్వాదిస్తున్న తీరు చూపరులను ఎంతో ఆకర్షించింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘‘ఫలానా పని బోరింగ్ అంటూ ఏమీ ఉండదు. ఏ పనిలోనైనా ఆనందం వెతుక్కోవచ్చని నిరూపించాడు ఈ పోలీసు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా జీవించగలరు అని ఒకరు, ఇలాంటి ట్రాఫిక్ పోలీసు మా దగ్గర కూడా ఉంటే బాగుంటుంది..డ్యాన్స్ సూపర్ భయ్యా.. అంటూ మరొకరు కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.