కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి కథలో ట్విస్ట్‌

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక యువతి కిడ్నాప్‌ డ్రామా ఆడింది. కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బంధించారని ఆరోపించింది. చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలు తండ్రి మొబైల్‌కు పంపింది. విడిపించేందుకు 30 లక్షల రూపాయలు డిమాండ్‌ చేసింది. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ కిడ్నాప్‌ వ్యవహారాన్ని బయటపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన 21 ఏళ్ల కావ్యకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు రాజస్థాన్‌ కోటాలోని కోచింగ్‌ సెంటర్‌లో తల్లిదండ్రులు చేర్పించారు.

కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి కథలో ట్విస్ట్‌

|

Updated on: Mar 22, 2024 | 7:31 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక యువతి కిడ్నాప్‌ డ్రామా ఆడింది. కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బంధించారని ఆరోపించింది. చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలు తండ్రి మొబైల్‌కు పంపింది. విడిపించేందుకు 30 లక్షల రూపాయలు డిమాండ్‌ చేసింది. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ కిడ్నాప్‌ వ్యవహారాన్ని బయటపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన 21 ఏళ్ల కావ్యకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు రాజస్థాన్‌ కోటాలోని కోచింగ్‌ సెంటర్‌లో తల్లిదండ్రులు చేర్పించారు. కుమార్తెతో పాటు మూడు రోజులు హాస్టల్‌లో ఉన్న ఆమె తల్లి తిరిగి మధ్యప్రదేశ్‌లోని సొంత ఊరికి వెళ్లిపోయింది. కావ్య తన స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకోవాలని భావించింది. తల్లి వెళ్లిన తర్వాత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చేరుకుంది. ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఒక రూమ్‌లో ఉంటుంది. అయితే కోటాలో ఉండి అక్కడ చదువుకుంటున్నట్లుగా తల్లిదండ్రులను నమ్మించింది. పరీక్షలకు సంబంధించిన మార్కుల వివరాలు కూడా పేరెంట్స్‌ మొబైల్‌కు పంపింది. మరోవైపు మార్చి 18న కావ్య తండ్రి మొబైల్‌ ఫోన్‌కు కొన్ని ఫొటోలు వచ్చాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్సానాలో వింత హోలీ.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!

రూ. 19 వేలకే అమెరికా-ఇండియా విమాన టికెట్‌ !! షాకవుతున్న నెటిజన్లు

Anand Mahindra: ఆ సంఘటన నా మతి పోగొట్టింది.. అదే నాకు గుణపాఠమైంది

క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కి అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌

పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్ట్‌పై ఉగ్రదాడి

Follow us