Mystery Tree: అంతుచిక్కని రహస్యం.. కత్తితో చెట్టుపై కొట్టగా ఒక్కసారిగా పైకి ఎగిసిపడ్డ నీరు.. వీడియో వైరల్.
అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఓ వింత ఘటన కలకలం రేపుతోంది. చిట్టడవిలో చెట్టులోనుంచి ఏకధాటిగా ఉబికి వస్తోన్న నీటిధార స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. కట్టెలు తెచ్చేందుకు అడవికి వెళ్లిన
అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఓ వింత ఘటన కలకలం రేపుతోంది. చిట్టడవిలో చెట్టులోనుంచి ఏకధాటిగా ఉబికి వస్తోన్న నీటిధార స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. కట్టెలు తెచ్చేందుకు అడవికి వెళ్లిన ఓ యువకుడి కంటపడ్డ ఈ దృశ్యం జనంలో అలజడి సృష్టించింది. ఓ మద్ది చెట్టులో నుంచి నీరు ఏకధాటిగా బయటకు చిమ్ముతుండడం ఆశ్చర్యానికి గురిచేసింది. కూనవరం మండలం గొమ్ముగూడెం పంచాయతీలోని కుమారస్వామి గూడెం అటవీ ప్రాంతంలో ఈ వింత ఘటన జరిగింది. గొమ్ముగుడెం అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టే ప్రయత్నంలో ఓ యువకుడు కత్తి తో చెట్టును నరకడంతో కత్తి తాకిన చోటనుంచి ఉన్నట్టుండి నీరు ఉబికి రావడం మొదలైంది. చుట్టూ చెట్లు తప్ప పెద్దగా మనుషులు తిరగని ప్రాంతం కావడంతో భయపడ్డ ఆ యువకులు దగ్గర్లోని గొమ్ముగూడెం గ్రామస్తులకు విషయం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు అడవిలో వింతని చూసి అవాక్కయ్యారు. చెట్టునుంచి నీరు ఎందుకొచ్చిందో తెలియక ఆశ్చర్యానికి గురౌతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..