Prithvi Akash Ambani: అంబానీ మనవడా మజాకా..సెక్యూరిటీ మామూలుగా లేదు..! సోషల్ మీడియాలో వైరల్ వీడియో..

Updated on: Apr 04, 2022 | 9:35 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ బుడి బుడి అడుగులతో బడి బాట పట్టాడు. ముంబైలోని ప్లే స్కూల్‌లో అడుగుపెట్టాడు. ముఖేష్ అంబానీ మనవడు మొదటిసారి బయటకు రావడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి.


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ బుడి బుడి అడుగులతో బడి బాట పట్టాడు. ముంబైలోని ప్లే స్కూల్‌లో అడుగుపెట్టాడు. ముఖేష్ అంబానీ మనవడు మొదటిసారి బయటకు రావడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి. 15 నెలల వయసున్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు – శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీలు ఎత్తుకుని తీసుకు వచ్చారు. దేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన పృథ్వీ మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌కు పంపాలని ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయించుకుంది. ప్రత్యేక సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పృథ్వీని స్కూలుకు తీసుకొచ్చారు. పృథ్వీ అంబానీ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని సన్నాహాలు చేశారు. అంబానీ మొదటి మనవడి భద్రత కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారు సాధారణ దుస్తులలో ఉంటారు. అటుగా వచ్చేవారిపై నిఘా పెట్టి ఉంటారు. పృథ్వీ అంబానీ క్షేమంగా ఉండేందుకు ఆయన వెంట ఎప్పుడూ ఒక డాక్టర్ ఉంటారు. ఇకపోతే, స్కూల్‌కి వచ్చిన మొదటి రోజే తోటి పిల్లలతో కలిసి పోయి ఆడుకున్నాడని పాఠశాల వర్గాలు తెలిపాయి. పృథ్వీ సాధారణ జీవితాన్ని గడపాలని ముఖేష్ కుటుంబం కోరుకుంటోంది. కాగా, పృథ్వీ అంబానీ తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

 

Follow Us