ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా అన్న అనంత్‌ అంబానీ

|

Mar 04, 2024 | 4:55 PM

భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్, రాధికా మర్చంట్ జోడీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో న భూతో న భవిష్యతి అన్న రీతిలో సాగుతున్నాయి. మూడ్రోజుల పాటు సాగనున్న ఈ ముందస్తు పెళ్లి వేడుకల్లో అంతర్జాతీయ పాప్ గాయని రిహాన్నా తన ప్రదర్శనతో ఉర్రూతలూగించింది. సినీ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై అత్యంత ఘనంగా సాగుతున్న వేడుకల్లో జోష్‌ నింపారు. వేడుకల తొలి రోజున అనంత్ అంబానీ ఉద్వేగంతో ప్రసంగించగా, తనయుడి మాటలకు ముఖేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్, రాధికా మర్చంట్ జోడీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో న భూతో న భవిష్యతి అన్న రీతిలో సాగుతున్నాయి. మూడ్రోజుల పాటు సాగనున్న ఈ ముందస్తు పెళ్లి వేడుకల్లో అంతర్జాతీయ పాప్ గాయని రిహాన్నా తన ప్రదర్శనతో ఉర్రూతలూగించింది. సినీ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై అత్యంత ఘనంగా సాగుతున్న వేడుకల్లో జోష్‌ నింపారు. వేడుకల తొలి రోజున అనంత్ అంబానీ ఉద్వేగంతో ప్రసంగించగా, తనయుడి మాటలకు ముఖేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితం పూల పాన్పు కాదని అది అందరికీ తెలుసని అనంత్‌ అంబానీ అన్నాడు. బాల్యం నుంచి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాననీ జీవిత ప్రస్థానంలో అనేక ఎదురుదెబ్బలు తగిలాయనీ అయితే ఆ బాధను మర్చిపోయేలా చేసేందుకు తన తల్లిదండ్రులు ఎంతో శ్రమించారనీ చెప్పాడు. తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచారనీ తన లక్ష్య సాధనలో అనుక్షణం ప్రోత్సహించారనీ వారికి తాను జీవితాంతం రుణపడి ఉంటాననీ తలిపాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ సౌత్ నిర్మాత నన్ను రూమ్‌కి రమ్మన్నాడు..

పెట్రోల్ కొట్టించేందుకు బైక్‌తో బంక్‌కు.. అంతలోనే వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా !!

భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్.. పొరపాటా ?? సాంకేతిక తప్పిదమా ??

కునుకు తీసిన ఉపాసన.. కాళ్లు నొక్కిన మెగా హీరో

100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా.. సొంత సినిమాలలో నష్టపోయినట్లు సినీ నటి