డాన్స్ ఇరగదీసిన అంబానీల కాబోయే కోడలు !! గెస్ట్‌లుగా నటీనటులు

Updated on: Jun 13, 2022 | 11:17 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీకి కాబోయే కోడలి భరతనాట్య అరంగేట్రం గ్రాండ్‌గా జరిగింది. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌ ఇందుకు వేదికైంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీకి కాబోయే కోడలి భరతనాట్య అరంగేట్రం గ్రాండ్‌గా జరిగింది. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్‌ కుటుంబం సహా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్. 2019లో వీరికి నిశ్చితార్థం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా భావన థాకర్‌ వద్ద శిష్యరికం చేసిన రాధిక.. తాజాగా తొలిసారి స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చారు. తనదైన శైలిలో నవరసాలను పండించి ఆకట్టుకున్నారు. కేవలం రాధికనే కాదు కాబోయే అత్తగారు నీతా అంబానీకి భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్‌ కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందరికంటే ముందే క్లాస్‌ రూమ్‌కి వచ్చిన అతిథి !! తనని చూసి సిబ్బంది షాక్‌ !!

హాస్టల్‌లో స్నానానికి బాత్రూంకి వెళ్లిన యువతి !! షవర్‌లోపల ఉన్నది చూసి షాక్‌ !!

సీతాకోక చిలుకలతో పెంగ్విన్స్‌ ఆటలు !! వావ్‌ అనిపించే ఈ వీడియో

 

Published on: Jun 13, 2022 11:17 AM