అందరికంటే ముందే క్లాస్ రూమ్‌కి వచ్చిన అతిథి !! తనని చూసి సిబ్బంది షాక్ !!
అమెరికాలోని ఓ స్కూల్లో ఊహించని సంఘటన జరిగింది. అందరికంటే ముందే ఎదురు చూడని అతిథి క్లాస్ రూమ్‌లో దర్శనమివ్వడంతో అంతా ఖంగు తిన్నారు. ప్రస్తుతం ఆ ప్రత్యేక అతిథికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
అమెరికాలోని ఓ స్కూల్లో ఊహించని సంఘటన జరిగింది. అందరికంటే ముందే ఎదురు చూడని అతిథి క్లాస్ రూమ్‌లో దర్శనమివ్వడంతో అంతా ఖంగు తిన్నారు. ప్రస్తుతం ఆ ప్రత్యేక అతిథికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళ్తే… కాలిఫోర్నియాలో ఉన్న పెస్కాడెరో హైస్కూల్ సిబ్బంది.. ఉదయాన్నే ఎప్పటిలాగే పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి వెళ్లారు. ఇందులో భాగంగా కొందరు ఓ క్లాస్ రూమ్‌కి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. క్లాస్‌రూంలో ఓ టేబుల్ పైన ఓ సింహం పిల్ల కూర్చుని ఉంది. వెంటనే పోలీసులను సమాచారం ఇచ్చారు స్కూల్ సిబ్బంది. దాంతో రెస్క్యూటీంను వెంటబెట్టుకుని అక్కడకు వచ్చారు పోలీసులు. సింహం పిల్లను బంధించి అక్కడ నుంచి ఓక్ ల్యాండ్‌లోని జూకి తరలించారు. ఆ సింహం పిల్లకు 4 నుంచి 6 నెలల వయసు ఉంటుందని, అది ఎవరపైనా దాడి చేయలేదని అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాస్టల్‌లో స్నానానికి బాత్రూంకి వెళ్లిన యువతి !! షవర్‌లోపల ఉన్నది చూసి షాక్ !!
సీతాకోక చిలుకలతో పెంగ్విన్స్ ఆటలు !! వావ్ అనిపించే ఈ వీడియో
మోసం చేసిన ప్రియుడ్ని వెంటాడి చంపిన యువతి !! ఏం చేసిందంటే ??